Share News

AP Politics: జగన్‌పై బుద్దా వెంకన్న ఫైర్

ABN , Publish Date - Aug 11 , 2024 | 11:12 AM

వైసీపీ అధినేత జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయిన రెండు నెలల్లోనే మతిభ్రమించిందని ఆరోపించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలతో డబ్బులతో విర్రవీగాడని, ఇప్పుడు అధికారం దూరం కావడంతో పిచ్చినట్టు అవుతుందో ఏమోనని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను జగన్ అవమానించారని మండిపడ్డారు.

AP Politics: జగన్‌పై బుద్దా వెంకన్న ఫైర్
TDP Leader Buddha Venkanna

విజయవాడ: వైసీపీ అధినేత జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయిన రెండు నెలల్లోనే మతిభ్రమించిందని ఆరోపించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలతో డబ్బులతో విర్రవీగాడని, ఇప్పుడు అధికారం దూరం కావడంతో పిచ్చినట్టు అవుతుందో ఏమోనని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను జగన్ అవమానించారని మండిపడ్డారు.


విలాసాలు..

‘అధికారం ఉన్నప్పుడు ప్రజల డబ్బులతో జగన్ విలాసలు. అధికారం పోవడంతో జగన్‌కు మతి భ్రమించి ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం పెట్టి తన పేరే పట్టుకున్నాడు. అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దదిగా ఉంది. అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించి ఉండవచ్చు. జగన్ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి జగన్. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. రూ.404 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. రూ.226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్. అంబేద్కర్ విగ్రహాలకు కూడా వైసీపీ రంగులు వేశాడు. అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిన వ్యక్తి జగన్. దళితులపై దమనకాండకు పాల్పడిన వారిని జగన్ కాపాడారు. బాధిత కుటుంబాలను ఎప్పుడైనా సీఎంగా పరామర్శించావా అని’ బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు.


budda.jpg


తమకేం సంబంధం..

‘రాష్ట్రంలో ఇటీవల జరిగిన గొడవలతో టీడీపీకి సంబంధం లేదు. మీలో మీరు కొట్టుకుని చనిపోతే టీడీపీపై నింద వేశావు. 27 సంక్షేమ పధకాలను దళితులకు ఇవ్వకుండా జగన్ నిలిపేశాడు. అంబేద్కర్ పేరు తొలగించి పేరు పెట్టుకున్న సైకో జగన్. జగన్ పాలనలో ఎంతమంది దోషులను పట్టుకున్నారో చెప్పాలి. డ్రైవర్‌ను ‌చంపిన నీ ఎమ్మెల్సీని కూడా సస్పెండ్ చేయలేదు. జగన్‌కు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం కట్టి తీరతాం. ట్విట్టర్‌లో రెచ్చగొట్టే పోస్ట్ పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు. సంపద సృష్టి లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందో జగన్‌కు తెలియదు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాం. జగన్ మళ్లీ వచ్చి ఉంటే రోబోలను పెట్టుకుని ప్రజలను తరిమి కొట్టేవాడు. కులాల మధ్య చిచ్చు పెట్టి వచ్చే పరిశ్రమలను ఏపీకి రాకుండా జగన్ కుట్ర చేస్తున్నాడు. చంద్రబాబు విజన్, పాలనా దక్షత ముందు నీ ఆటలు సాగవు. ఇప్పుడు అయినా రాష్ట్ర అభివృద్ధికి సహకరించు జగన్. అడ్డుకునేలా కుట్ర చేస్తే ఈసారి ప్రజలే నిన్ను తరిమి కొడతారు అని’ బుద్దా వెంకన్న మండిపడ్డారు.


budda-2.jpg

Updated Date - Aug 11 , 2024 | 11:12 AM