Home » CM Ramesh
వైసీపీ ప్రభుత్వంలా ఇసుక, భూమాఫియాలు కూటమి ప్రభుత్వంలో ఉండవని ఎంపీ సీఎం.రమేష్ అన్నారు. ఎలక్షన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. ఇంటింటికీ మంచినీరు సదుపాయం వచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు
వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తాను ఫిర్యాదు చేశానని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. త్వరలో జగన్‌తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయి ... ఇది ఆరంభం మాత్రమేనని సీఎం రమేశ్ పేర్కొన్నారు.
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలంటే సభ్యత్వాలు ఎంతో అవసరమని తెలిపారు.
Andhrapradesh: పరవాడ సినర్జిన్ ఫార్మాలో జరిగిన ఘటన దురదృష్టకరమని .. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విశాఖపట్నం ఇండస్ హాస్పిటల్ లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు...
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) విమర్శించారు. సొంతబాబాయిని జగన్ చంపారని ఆరోపించారు.
లోక్ సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
Andhrapradesh: అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారి అరులైన్లు విస్తరించేలా త్వరలో చర్యలు తీసుకుంటామని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కడప జిల్లా: అనకాపల్లి ఎంపీగా ఎన్నికై కడపకు రావడం చాలా ఆనందంగా ఉందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శుక్రవారం కడపకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ నుంచి వచ్చి అనకాపల్లిలో ఎలా రాజకీయాలు చేస్తారని వైసీపీ నేతలు ప్రశించారని అన్నారు. అయితే..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమి కార్యకర్తలు ఐకమత్యంతో తమను గెలిపించినందుకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(MP C.M.Ramesh) కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తీర్చిదిద్దారని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మోడీ హయాంలో ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
ఏయూలో చాలా అక్రమాలు, అన్యాయాలు జరిగాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) తెలిపారు. ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన వదిలేది లేదని, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.