Share News

CM Ramesh: కడప స్టీల్ ప్లాంట్ కోసం కృషి చేస్తా: ఎంపీ సీఎం రమేష్

ABN , Publish Date - Jul 12 , 2024 | 01:08 PM

కడప జిల్లా: అనకాపల్లి ఎంపీగా ఎన్నికై కడపకు రావడం చాలా ఆనందంగా ఉందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శుక్రవారం కడపకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ నుంచి వచ్చి అనకాపల్లిలో ఎలా రాజకీయాలు చేస్తారని వైసీపీ నేతలు ప్రశించారని అన్నారు. అయితే..

CM Ramesh: కడప స్టీల్ ప్లాంట్ కోసం కృషి చేస్తా: ఎంపీ సీఎం రమేష్

కడప జిల్లా: అనకాపల్లి (Anakapalli) ఎంపీగా ఎన్నికై కడపకు రావడం చాలా ఆనందంగా ఉందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (BJP MP CM Ramesh) అన్నారు. శుక్రవారం కడప (Kadapa)కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ నుంచి వచ్చి అనకాపల్లిలో ఎలా రాజకీయాలు చేస్తారని వైసీపీ నేతలు (YCP Leaders) ప్రశించారని, జగన్ (Jagan) తల్లి విజయలక్ష్మి (Vijayalakshmi) ఓటమి పాలయ్యారని, మీరెంత అంటూ తనను అపహాస్యం చేశారని అన్నారు. విమర్శకుల నోరు మూయించేలా అనకాపల్లి ప్రజలు తనను గెలిపించి.. వారికి బుద్ది చెప్పా రన్నారు.


వైసీపీ నేతల్లా తాను దౌర్జన్యాలు చేయలేదని.. కడప జిల్లాకు ఉన్న మంచి పేరు చేడగొట్టారని సీఎం రమేష్ మండిపడ్డారు. మంచి పాలన అందించి కడప జిల్లాకు మంచి పేరు తెస్తానన్నారు. అనకాపల్లితో పాటు సొంత జిల్లా కడపను మర్చిపోనన్నారు. కడప జిల్లా వాసుల రుణం తీర్చుకుంటానని.. అనకాపల్లిలో ఉన్నా కడపను అశ్రద్ధ వహించేది లేదని స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ళు కట్టాలనే ద్యాస వైసీపీకి లేదని, మొదటి నుంచి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డబ్బులు గుంజారని ఆయన ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. మొన్ననే స్టీల్ ప్లాంట్ విషయంపై చంద్రబాబుతో చర్చించామని, యుద్ధప్రాతిపదికన స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తామని చెప్పారు. మాజీ సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ స్థలం మార్చారే తప్ప సాధించిందేమి లేదని ఎంపీ సీఎం రమేష్ ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసు..

జగన్ పాలనలో పూర్తిగా కుదేలైన చేనేత రంగం..

బద్రీనాథ్ హైవే మూసివేత..

అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు పచ్చజెండా

4.0 పాలనలో దూసుకుపోతున్న ఏపీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 12 , 2024 | 01:10 PM