Home » DK Aruna
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక నియంతలా ప్రవర్తిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు.
లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలిపారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని.. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు.
ప్రభుత్వ తీరు వల్లే లగచర్ల ఘటన చోటు చేసుకుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. లగచర్లలో 144 సెక్షన్, శాంతిభద్రతల సమస్య ఎందుకొచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఫార్మా కారిడార్ ఏర్పాటు విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రికి తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు.
తెలంగాణలో ఓ నియంత ప్రభుత్వం పోయి మరో నియంత ప్రభుత్వం రాజ్యమేలుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ(Mahbubnagar MP DK Aruna) అన్నారు, చార్మినార్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
‘‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి భయమెందుకు?. ఎవరికి భయపడి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు?’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు.
వక్ఫ్ బోర్డు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తున్నట్లుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించారు. బోడుప్పల్ ఆర్ఎంఎస్ కాలనీలో వక్ఫ్ భూ బాధితుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు(శనివారం) నిర్వహించారు.
‘‘హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు?
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా డ్రామా ఆడుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.
వక్ఫ్ చట్టం సవరణ బిల్లు పరిశీలనకు కేంద్రం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు.