Share News

TG News: వక్ఫ్ బోర్డు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం: డీకే అరుణ

ABN , Publish Date - Sep 14 , 2024 | 10:41 PM

వక్ఫ్ బోర్డు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తున్నట్లుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించారు. బోడుప్పల్ ఆర్ఎంఎస్ కాలనీలో వక్ఫ్ భూ బాధితుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు(శనివారం) నిర్వహించారు.

TG News: వక్ఫ్ బోర్డు  విషయంలో ఎన్డీఏ ప్రభుత్వంపై  తప్పుడు ప్రచారం: డీకే అరుణ

హైదరాబాద్: వక్ఫ్ బోర్డు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తున్నట్లుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యురాలు, ఎంపీ డీకే అరుణ విమర్శించారు. బోడుప్పల్ ఆర్ఎంఎస్ కాలనీలో వక్ఫ్ భూ బాధితుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు(శనివారం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరుణ, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


eetala.jpg

గత కొన్నేళ్లుగా రిజిస్ట్రేషన్ డాకుమెంట్ల బిల్డింగ్ అనుమతులు ఉన్నప్పటికీ వక్ఫ్ భూములు అంటున్నారని, తాము కొన్నేళ్లుగా పోరాడుతున్న తమకు న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ, ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బోడుప్పల్ భూ బాధితుల సమస్యను కేంద్ర జాయింట్ పార్లమెంట్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఈ కమిటీ ఏర్పడ్డదే బాధితులకు న్యాయం చేయటానికి అని అన్నారు. ఈ కమిటీ అన్ని ప్రాంతాల్లోని బాధితులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుందని చెప్పారు.


ఈనెల ఆఖరి వరకు హైదరాబాద్‌లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యటిస్తుందని అన్నారు. దేశంలో వక్ఫ్ భూములు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తర్రదేశ్, రెండో రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు, వక్ఫ్ భూముల్లో అన్ని కులాల, మతాల, వర్గాల ప్రజలు ఉన్నారని గుర్తుచేశారు. ముస్లింలలో బాధితులకు న్యాయం చేసేందుకు వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు చేసినట్లు వివరించారు. ఈ సవరణ విషయం ఏ మతం, ఏ వర్గానికి సంబంధం లేదని అన్నారు.


ధరణి వచ్చాకే తెలంగాణలో ఈ వక్ఫ్ భూముల పరిధి పెరిగిందని తెలిపారు. బోడుప్పల్ పరిధిలో 300 ఎకరాల స్థలంలో సుమారు 800 కుటుంబాలు బాధితులుగా ఉన్నారని చెప్పారు. నిరుపేదల సొంతింటి కల ఇంకా నిజ కావడం లేదని తెలిపారు. వక్ఫ్ భూ బాధితుల సమస్యలపై రేవంత్ సర్కార్ స్పందించాలని, జాయింట్ పార్లమెంట్ కమిటీకి రిప్రెజెంటేషన్‌ పంపాలని డీకే అరుణ, ఈటల రాజేందర్ కోరారు.

Updated Date - Sep 14 , 2024 | 10:43 PM