Share News

BJP MP's: సీఎం రేవంత్ సోదరుడి అరాచకాలు.. లగచర్ల ఘటనపై బీజేపీ ఎంపీల సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 18 , 2024 | 01:04 PM

లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలిపారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని.. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు.

BJP MP's: సీఎం రేవంత్ సోదరుడి అరాచకాలు.. లగచర్ల ఘటనపై బీజేపీ ఎంపీల సంచలన వ్యాఖ్యలు

సంగారెడ్డి జిల్లా: సీఎం రేవంత్‌రెడ్డికు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. ఇవాళ(సోమవారం) సంగారెడ్డి జిల్లాలోని సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి లగచర్ల కేసులో జైలులో ఉన్న 16 మందితో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఆ పార్టీ కీలక నేతలు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వబోమని 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహనికి గురయ్యారని చెప్పారు. రైతులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని అన్నారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకు రాకపోతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక్కరే ఎందుకు వెళ్లారని నిలదీశారు. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను బయపెట్టారని అన్నారు. భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారన్నారు. ఈ ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశారని అన్నారు. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వారిని వదిలేసి మిగతా వారిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు.


భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వారిని కలిసి మాట్లాడితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేయించి ఇలా చేయడం కరెక్టు కాదని హితవు పలికారు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్లవచ్చు కానీ తనను అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయితే తమ నియోజకవర్గం బాగుంటుందని అనుకుంటే మీరేమో జనాలపై కక్ష కట్టారని ధ్వజమెత్తారు. ఓటేసి గెలిపించిన జనాల కాంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా అని ప్రశ్నించారు. సీఎం కొడంగల్ వాసి కాదు వలస వచ్చారని విమర్శలు చేశారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారా అని నిలదీశారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలిపారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని.. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అహంకారం వీడాలి..రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలని డీకే అరుణ కోరారు.


eetala.jpg

ఖమ్మంలో అరెస్ట్‌లు.. ఇప్పుడు దాడులు చేస్తారా: రాజేందర్

లగచర్ల ఘటన వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర ఉందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. బేషరతుగా ప్రభుత్వం బాధితులకు క్షమాపణ చెప్పి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దుర్మార్గంగా ప్రవర్తించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందని చెప్పారు. కాంగ్రెస్ నేతలే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని ఈ దాడులు చేయించారని అంటున్నారని అన్నారు.


144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని అన్నారు.సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుందని అన్నారు. రైతులకు సంకెళ్లు, థర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడరని అన్నారు. గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదని అన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఉరుకోమని ఈటల రాజేందర్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

ముషాయిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..

గనుల ఘనుడు వెంకటరెడ్డి విడుదల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 18 , 2024 | 01:07 PM