Home » Gangula Kamalakar
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని హరీష్‌రావు అన్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శలు చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కులు కూడా కాంగ్రెస్ నేతలే పంచుతున్నారని.. గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీరు నిల్వ చేయవద్దంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పష్టం చేసిన సంగతి బీఆర్ఎస్ నేతలకు తెలియదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రశ్నించారు.
ఎల్లంపల్లి నుంచి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయని పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు తాము పిలిచిన గ్లోబల్ టెండర్లను రద్దుచేసి..
తెలంగాణ రాజకీయ సమీకరణలు ఊహించని రీతిలో మారిపోతున్నాయ్..! కర్ణాటకలో ఏ క్షణాన కాంగ్రెస్ గెలిచిందో ఒక్కసారిగా తెలంగాణలో పుంజుకోవడమే కాదు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు దక్కించుకుని అధికారం చేపట్టింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాక ప్రతిపక్షాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి..!
మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్దిరోజులుగా ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగినా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైందని శనివారం వార్తలు వచ్చాయి.
కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) అన్నారు. బీఆర్ఎస్కు ఇతర పార్టీలతో పనిలేదని.. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తమదని చెప్పారు.
తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ మిగలరని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) తెలిపారు. గురువారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంటున్నారని.. ముందు వాళ్ల నేతలు బీఆర్ఎస్లోకి రాకుండా చూసుకోవాలని హితవు పలికారు.
బీజేపీ ( BJP ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay ) ని కరీంనగర్లో గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) ఎద్దేవా చేశారు. గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్‌ని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. గ్రామగ్రామాన అభివృద్ధి చేసింది.. ఆనాటి ఎంపీ వినోద్ కుమార్ మాత్రమేనని గంగుల కమలాకర్ తెలిపారు.