BRS: రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాం: హరీష్‌రావు
ABN , Publish Date - Nov 22 , 2024 | 09:00 AM
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని హరీష్‌రావు అన్నారు.
ఖమ్మం జిల్లా: బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు (Harish Rao), గంగుల కమలాకర్ (Gangula Kamalakar), పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) శుక్రవారం ఖమ్మం (Khammam)లోని పత్తి మార్కెట్‌కు (Cotton Market) వచ్చారు. ఈ సందర్భంగా పత్తి రైతులతో నేరుగా మాట్లాడి.. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నామని అన్నారు. పత్తి ధర తగ్గింపుపై మార్కెట్ అధికారులను హరీష్‌రావు ప్రశ్నించారు. రైతుబంధు వస్తుందా అని రైతులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు వేయడం లేదని.. పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్‌రావు అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్‌రావు సవాల్
కాగా రంగనాయక్ సాగర్ దగ్గర హరీశ్‌రావు ఇరిగేషన్ భూములు ఆక్రమించాడంటూ ముఖ్యమంత్రి నిరాధార ఆరోపణలు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. తాను నిబంధనలకు లోబడి ధరణి ద్వారా భూమిని కొనుగోలు చేశానని, ఒక్క గుంట కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రికి వాటిని నిరూపించాల్సిన బాధ్యత ఉందని, ఆయన ఎప్పుడు వస్తారో చెబితే తాను ఆ భూమి వద్దకు వస్తానని సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిని బదలాయించుకుని హరీశ్‌రావు రంగనాయక సాగర్‌లో ఫామ్‌హౌస్ నిర్మించారని వేములవాడలో బుధవారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం మాసాన్‌పల్లిలోని పెద్దమ్మ ఆలయంలో గురువారం జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత హరీశ్ రావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తనపై చేసిన ఆరోపణలకు స్పందించారు. ఒక్క గుంట భూమి ఆక్రమించినట్టు తన చరిత్రలోనే లేదని, ఆక్రమణల చరిత్ర ముఖ్యమంత్రికే ఉందంటూ ధ్వజమెత్తారు. ఆక్రమణలలో మునిగితేలే రేవంత్ రెడ్డికి అందరూ దొంగల్లానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ను అమలు చేయలేక ప్రతిపక్షంపై నిందలు వేస్తూ రేవంత్ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. 11 నెలల కాలంలో సీఎం, ఆయన మంత్రులు చేసిందేమీ లేదని విమర్శించారు. లోపాలను ఎత్తిచూపుతున్న కేటీఆర్‌పై కేసులు పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం బ్లాక్‌మెయిల్ రాజకీయాలు
రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తెరలేపారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేద న్నారు. బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ రైతులు, సామాన్యుల పక్షాన మాట్లాడుతూనే ఉంటుందని చెప్పారు. ఇక, వరి కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి చెప్పే లెక్కలకు పొంతన లేదన్నారు. సన్నాలకు ఇస్తామన్న రూ.500 బోనస్ సంగతి పక్కనపెడితే కొనుగోళ్లు సరి గా లేక కనీస ధర కంటే రూ.500 తక్కువకు ధా న్యాన్ని దళారులకు అమ్ముకునే దుస్థితి రైతులకు ఎదురైందని హరీశ్‌రావు వాపోయారు. హరీశ్ వెంట మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, టీఎ్‌సటీపీస్ మాజీ చైర్మన్ భిక్షపతి స్వామి, జైపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరుతున్న 8047 మంది కానిస్టేబుళ్లకు హరీశ్ రావు ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రచారం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఈ కొలువులను తన ఖాతాలోనే వేసుకుంటారేమోనని ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అదానీ లంచాల యాత్ర.. ఇరుక్కున్న జగన్
అదానీపై కేసు.. తాడేపల్లి ప్యాలెస్‌కు సెగ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News