Share News

Gangula Kamalakar : ధాన్యం కొనుగోలులో కుంభకోణం: గంగుల

ABN , Publish Date - Jul 31 , 2024 | 03:36 AM

ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయని పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. ఎన్నికలకు ముందు తాము పిలిచిన గ్లోబల్‌ టెండర్లను రద్దుచేసి..

 Gangula Kamalakar : ధాన్యం కొనుగోలులో కుంభకోణం: గంగుల

హైదరాబాద్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయని పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. ఎన్నికలకు ముందు తాము పిలిచిన గ్లోబల్‌ టెండర్లను రద్దుచేసి.. 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేవలం నలుగురు కాంట్రాక్టర్లకే అప్పగించారన్నారు.

టెండరు రేటు క్వింటాలుకు రూ.2,007 అయితే మిల్లర్ల నుంచి రూ.2,223 చొప్పున రూ.216 అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. దీని వెనక రూ.750 కోట్ల కుంభకోణం ఉందని, వెంటనే విచారణ జరిపించాలని, సభాసంఘం వేయాలని డిమాండ్‌ చేశారు.

కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని ప్రజలకు ఆశ కల్పించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Updated Date - Jul 31 , 2024 | 03:36 AM