Home » Ganta Srinivasa Rao
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి .. ఓ రాజకీయ పార్టీకి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఒకప్పుడు పార్టీ కోసం పని చేసిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు. రేపు ఎల్లుండి మరి కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో చేపట్టిన సంప్రోక్షణ శాంతి హోమం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ..ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు.
Andhrapradesh: వైసీపీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ ఐదు సంవత్సరాలు గాడిదలు కాసారా అంటూ విరుచుకుపడ్డారు. తాము వచ్చిన మూడు నెలలోనే మాంగనీస్ గనులు కేటాయించామని తెలిపారు.
Andhrapradesh: సింహాచలం వరాహ నరసింహస్వామిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి చేసిన ట్విట్‌పై ఎమ్మెల్యే స్పందించారు.
వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
హైడ్రా తరహా సంస్థను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తే తరువాత పరిణామాలు ఎలా ఉండవచ్చనే చర్చ మొదలైంది. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాళాలు కబ్జాచేసి నిషేధిత ప్రాంతంలో నిర్మించిన కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో..
పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న భీమిలి బీచ్‌రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బలు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. రాత్రివేళల్లో తవ్వకాలు జరిపి మట్టి, ఇసుక తరలించుకుపోతున్నారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొలిసారిగా ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విశాఖపట్నం జిల్లా సింహాచలం అడవివరం సమీపంలోని గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ (Pension) నగదు వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని, కానీ ఎన్డీయే ప్రభుత్వంలో గెలిచిన నెలలోనే ఇచ్చిన మాటకి కట్టుబడి రూ.4వేలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinivasa Rao) అన్నారు. సింహాచలం మండలం అడవివరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఏపీలో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinivasa Rao) మండిపడ్డారు. టీడీపీ నాయకులు ప్రైవేటు ఆస్తులైన వైసీపీ కార్యాలయాల్లోకి వెళ్లి సందర్శించడం సరికాదన్న బొత్స మాటలపై ఆయన ధ్వజమెత్తారు.