Share News

MLA Ganta: ఇచ్చిన మాటకి కట్టుబడి రూ.4వేలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ABN , Publish Date - Jul 01 , 2024 | 03:34 PM

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ (Pension) నగదు వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని, కానీ ఎన్డీయే ప్రభుత్వంలో గెలిచిన నెలలోనే ఇచ్చిన మాటకి కట్టుబడి రూ.4వేలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinivasa Rao) అన్నారు. సింహాచలం మండలం అడవివరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

MLA Ganta: ఇచ్చిన మాటకి కట్టుబడి రూ.4వేలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
MLA Ganta Srinivasa Rao

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్(Pension) నగదు వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని, కానీ ఎన్డీయే ప్రభుత్వంలో గెలిచిన నెలలోనే ఇచ్చిన మాటకి కట్టుబడి రూ.4వేలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinivasa Rao) అన్నారు. సింహాచలం మండలం అడవివరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇవాళ(సోమవారం) పెన్షన్ల పంపిణీ అనేది రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలా జరుగుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం 6గంటల నుంచే ప్రతి ఇంటికీ వెళ్లి నగదు ఇస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా వికలాంగులు, వృద్ధుల కళ్లల్లో ఆనందం చూసి మనసు చలించిందని ఎమ్మెల్యే గంటా అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ ప్రజల ఇళ్ల వద్దకే చేరుతాయన్నారు. పెన్షన్ల పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.819కోట్ల అదనపు భారం పడుతోందని అయినా.. దాన్ని ఎన్డీయే ప్రభుత్వం ఆనందంగా స్వీకరిస్తుందని ఆయన అన్నారు. సింహాచలంలో బీఆర్టీసీ టీడీఆర్ రోడ్డు సహా మిగతా సమస్యలపైనా ప్రత్యేక దృష్టిపెట్టి త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

ఈ వార్త కూడా చదవండి:

AP Politics: ప్రజల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన చరిత్ర మీ పార్టీదే: ఎమ్మెల్యే గంటా

Updated Date - Jul 01 , 2024 | 03:34 PM