Home » Gottipati Ravikumar
వైసీపీ ప్రభుత్వం ఇంధన రంగంలో రూ.1.29 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసిందని రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా ముందుకెళ్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదానిపై చర్చించామన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని
లైన్మెన్ కూర రామయ్య(Lineman Kura Ramaiah) చేసిన సాహనం ఏపీ విద్యుత్ ఉద్యోగులందరికీ ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi Kumar) అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ తీగలపై నడిచివెళ్లి కరెంట్ పునరుద్ధరించడాన్ని మంత్రి కొనియాడారు.
కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద ముగ్గురు యువకులు మృతిచెందడంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ద్విచక్రవాహనం విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు విద్యార్థులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసినట్లు మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండ్రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో అమరావతి నుంచి మంత్రి వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. వర్షం ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులపై గొట్టిపాటి ఆరా తీశారు.
Andhrapradesh: పేదలకు ఫించన్ అందకుండా చేసే వైసీపీ కుట్రలను ఎందాకైనా అడ్డుకుంటామని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పైశాచికత్వానికి చంద్రబాబు పోరాటతత్వానికి మధ్య జరిగే పోరులో ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. చంద్రబాబు పోరాటం మానవత్వం కోసమని.. జగన్ పాకులాట మనుషుల్ని హింసించడమని మండిపడ్డారు. తెలుగుదేశం ధ్యేయం పేదల సంక్షేమం అయితే.. వైసీపీ లక్ష్యం శవ రాజకీయమని విమర్శలు గుప్పించారు.