Share News

Andhra Pradesh: ఏపీలో త్వరలో ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

ABN , Publish Date - Nov 02 , 2024 | 06:09 PM

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా ముందుకెళ్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదానిపై చర్చించామన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని

Andhra Pradesh: ఏపీలో త్వరలో ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన
AP MLC Elections

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ జిల్లాలో పార్టీ నేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నీటి సంఘాల ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఎన్నికల సన్నద్దతపై సమావేశంలో చర్చించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా ముందుకెళ్తోందన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదానిపై చర్చించామన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలు ఉన్నాయని, అలాగే జిల్లాలో రోడ్ల సమస్య ఉందని ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. రానున్న రోజుల్లో రాజకీయంగా, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రహదారుల మరమ్మతులు క్రమం తప్పకుండా చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయన్నారు.


ప్రజలపై భారం తగ్గించాం

రాష్ట్రంలో రహదారుల నిర్వహణను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రహదారుల నిర్మాణంతో పాటు రోడ్ల మరమ్మతులు చేయిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను విధించిందని, తాము అధికారంలోకి రాగానే చెత్త పన్నును తొలగించామన్నారు. ట్రూ అప్ ఛార్జీల భారం ప్రజలపై మోపింది తాము కాదన్నారు. జగన్ ఆ భారం ప్రజలపై వేసి నెమ్మదిగా తప్పుకున్నారని మంత్రి విమర్శించారు. అనుయాయులకు మేలు చేయడం కోసం జగన్ ఎక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. జగన్ చేసిన తప్పుల కారణంగా నేడు ప్రజలపై భారం పడుతుందన్నారు. ప్రతి ఏడాది విద్యుత్తు వినియోగం పెరుగుతోందని, దానికి అనుగుణంగా ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ జిల్లాలు విద్యుత్తు ప్రాజెక్టులకు అనుకూలమని మంత్రి తెలిపారు. బయట నుంచి విద్యుత్తు కొనుగోలు చేయకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


స్మార్ట్ మీటర్లు పెట్టలేదు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు మాత్రమే అయిందని, తక్కువ వ్యవధిలో అద్బుతాలు చేయలేమన్నారు. రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు వైసీపీ నాశనం చేసిందని, జగన్ పాలనలో అభివృద్ధి కుంటిపడిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా స్మార్ట్ మీటర్లు పెట్టలేదని, కేవలం వైసీపీ తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 02 , 2024 | 06:09 PM