Home » HD Deve Gowda
మోదీపై పోటీ చేయగలిగే నేత 'ఇండియా' కూటమిలో లేరని, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడంలో విజయవంతమైన నేతల్లో డొనాల్డ్ ట్రంప్, మోదీ ఉన్నారని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. మోదీ-ట్రంప్ మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని చెప్పారు.
లైంగిక దాడి, లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జేడీ(ఎస్) మాజీ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్) అరెస్ట్ చేసిన ప్రజ్వల్ కస్టడీ సోమవారంతో ముగిసింది.
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రజల్వ్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మౌనం వీడారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉందనే సంకేతాలిచ్చారు. ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందో వారందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే వారి పేర్లు తాను చెప్పదలచుకోలేదన్నారు.
మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చేదు అనుభవం ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో రేవణ్ణను సంబంధించినట్టు చెబుతున్న ఒక అశ్లీల వీడియో పోస్ట్ కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిడది సమీపంలో రోడ్డు పక్కన ఉండే ఆస్తిని రాయించుకునేందుకు 9ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన వారికి ఓటేస్తారా.. అంటూ డీసీఎం డీకే శివకుమార్‌పై పరోక్షంగా మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీపై బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నిర్ణయం తీసుకుంటారని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు.
అయోధ్యకు వెళ్లాలని ఆసక్తిగా ఉందని, ప్రయత్నిస్తానని మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు.
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తనకు 90 ఏళ్లు అని, వయస్సు పైబడినందున ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు.
రాష్ట్రరాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని దేవేగౌడ(Former Prime Minister Deve Gowda) నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ(Prime Minister Modi)తో భేటీ అయి డీల్ కుదుర్చుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పక్కా కుదుర్చుకున్నారు.
మాజీ జనతాదళ్ పార్టీలతో కలిసి ''జనాతా ఫ్రీడం ఫ్రంట్'' ఏర్పాటు కోసం నాలుగు నెలల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్ తనను సంప్రదించినట్టు జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ తెలిపారు. అయితే అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు.