Home » Independence Day
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాలస్లో ఏర్పాటు చేసిన అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
గాంధీభవన్లో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహే్షకుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
రానున్న రోజుల్లో తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’గా మార్చనున్నామని, అందుకు కార్యాచరణ ప్రారంభమైందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు.
Telangana: రాజేంద్రనగర్లో నూతన హైకోర్టు భవనానికి ఇప్పటికే సీజేఐ శంకుస్థాపన చేశారని.. కొత్త హైకోర్టు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే తెలిపారు. తెలంగాణ హైకోర్టులో 78వ స్వాతంత్ర్యదినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Telangana: 78వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా దుబ్బాక గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. దుబ్బాక ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి అవడం లేదని.. ముందుకు పోవడం లేదని తెలిపారు.
Andhrapradesh: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పవన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవవందాన్ని స్వీకరించారు డిప్యూటీ సీఎం. ఆపై ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగిస్తూ..
పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఇటీవలి నెలకొన్న రాజకీయ అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడి హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై మోదీ స్పందించారు.
Andhrapradesh: 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... వైద్య, ఆరోగ్య శాఖలో 2014 నుంచి 2019 వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించామని అన్నారు.
విజయవాడ: దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నామని, 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు.