Share News

Alok Arade: తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై టీ.హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే?

ABN , Publish Date - Aug 15 , 2024 | 01:36 PM

Telangana: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనానికి ఇప్పటికే సీజేఐ శంకుస్థాపన చేశారని.. కొత్త హైకోర్టు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే తెలిపారు. తెలంగాణ హైకోర్టులో 78వ స్వాతంత్ర్యదినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Alok Arade: తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై టీ.హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే?
T. High Court Chief Justice Alok Arade

హైదరాబాద్, ఆగస్టు 15: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనానికి ఇప్పటికే సీజేఐ శంకుస్థాపన చేశారని.. కొత్త హైకోర్టు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే (T. High Court Chief Justice Alok Arade) తెలిపారు. తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) 78వ స్వాతంత్ర్యదినోత్సవం ఘనంగా నిర్వహించారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త హైకోర్టు నిర్మాణానికి బడ్జెట్ కేటాయించిందన్నారు.

Chandrababu: అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించి.. అక్కడే భోజనం చేసిన చంద్రబాబు దంపతులు


తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. త్వరలోనే తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని నడిపించేందుకు న్యాయవ్యవస్థ ప్రాముఖ్యంగా పనిచేస్తుందన్నారు. ఏడాదిలో 9810 పెండింగ్ కేసులు పరిష్కరించామని చెప్పారు. కోర్ట్ రికార్డ్స్ డిజిటలైజేషన్‌లో భాగంగా హనుమకొండ, నల్గొండ కోర్టులను మోడల్ కోర్టులుగా గుర్తించామని అన్నారు.

PM Narendra Modi: బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై తొలిసారి స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ


ఈటీహెచ్‌సీఆర్ వెబ్ సైట్‌ను ప్రారంభిస్తున్నామని.. నాలుగు లోక్ ఆదాలత్‌లలో 73,786 కేసులు కాంప్రమైజ్ చేసి.. రూ.4.9 కోట్లు బాధితులకు అందించామన్నారు. ఎంతోమంది యువతీ యువకులు న్యాయవ్యవస్థవైపు ఆసక్తి చూపుతున్నారని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే పేర్కొన్నారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ మెంబెర్స్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: వారి జోలికి ఎవరొచ్చినా ఊరుకోం

Kotha Prabhakar: దుబ్బాక అభివృద్ధిపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 15 , 2024 | 01:36 PM