Home » Lok Sabha Election 2024 Phase 6
18వ లోక్సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు.
కీలకమైన ‘లోక్సభలో ప్రతిపక్ష నేత’ స్థానం పదేళ్ల తర్వాత భర్తీ కానుంది. గత రెండుసార్లు కాంగ్రెస్ సహా మరే పార్టీ కనీస సంఖ్యలో సీట్లు సాధించకపోవడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాల్లో నెగ్గడంతో అర్హత సాధించింది. లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య 543 కాగా.. ఇందులో పదిశాతం (54) సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష నేత పదవిని పొందే అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లనే సాధించింది. 2019లో 52 స్థానాలతో సరిపెట్టుకుంది.
లోక్సభ ఎన్నికలకు బీజేపీ మోదీ గ్యారెంటీతో వెళ్లిందని, కానీ ఫలితాల తీరుతో ఆ గ్యారెంటీకి వారంటీ ఖతమైందని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో బీజేపీ ఓటమికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో మోదీ సర్కారు యువత, రైతులను వెన్నుపోటు పోడిచిందని విమర్శించారు.
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. లోక్సభకు శనివారం జరుగుతున్న 6వ దశ పోలింగ్లో కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే..
లోక్ సభ ఆరో దశ ఎన్నికలు(Lok Sabha election 2024) జరుగుతున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) ఎక్స్ అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
లోక్సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.