Delhi: నియంతృత్వం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా ఓటు వేశా: అరవింద్ కేజ్రీవాల్
ABN , Publish Date - May 25 , 2024 | 01:08 PM
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. లోక్‌సభకు శనివారం జరుగుతున్న 6వ దశ పోలింగ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. లోక్‌సభకు శనివారం జరుగుతున్న 6వ దశ పోలింగ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.తన తండ్రి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన కేజ్రీవాల్.. అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా నాన్న, భార్య, ఇద్దరు పిల్లలందరూ ఓటు వేశారు. ఆరోగ్యం బాలేకపోవడంతో అమ్మ ఓటు వేయలేకపోయారు. నియంతృత్వానికి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా నేను ఓటేశాను. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
దేశంలోని 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
6వ దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. పొత్తు ఉన్న కారణంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన నియోజకవర్గంలో బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు.
For Latest news and National News click here..