Home » AAP
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఢిల్లీ ఆరవ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడైన షోకోన్ ప్రస్తుతం నాంగ్లోయి జాట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983-88 మధ్య ఆయన కురుక్షేత్ర ఎన్ఐటీలో ఇంజనీరింగ్ గ్యాడ్యుయేట్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోత్ తన మంత్రి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో 'ఇండిపెండెన్స్ డే' సందర్భంగా త్రివర్ణ పతాకం ఎవరు ఎగుర వేయాలనే దానిపై పరిశీలన జరిగింది. అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషిని త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు.
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు గెహ్లాట్ రాజీనామా లేఖ రాశారు. అమలుకు నోచుకోలేని వాగ్దానాలు, ఇటీవల తలెత్తిన వివాదాలు వంటివి తన రాజీనామాకు కారణాలుగా అందులో ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను పార్టీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
కిరారీ అసెంబ్లీ నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్తల్లోనూ గట్టిపట్టు ఉన్న అనిల్ ఝా కొద్దికాలంలో పార్టీ నాయకత్వం, విధానాలపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ మారడం ద్వారా బీజేపీకి సంప్రదాయబద్ధంగా గట్టి పట్టున్న కిరారీలో ఆప్‌కు లబ్ధి చూకూరే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఢిల్లీ మేయర్ పీఠానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మహేశ్ కించి విజయం సాధించారు.
అహ్మద్ భార్య, కుమారుడు కూడా ఇటీవల ఆప్‌లో చేరారు. అక్టోబర్ 29న అహ్మద్ కుమారుడు చౌదరి జుబీర్ అహ్మద్, ఆయన కౌన్సిలర్ భార్య షాగుఫ్తా చౌదరి ఆప్‌లో చేరారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అహ్మద్ కుటుంబం పార్టీ మారడం కాంగ్రెస్‌కు మింగుడపడటం లేదని తెలుస్తోంది.
ఈ ఏడాది అంటే 2024, ఫిబ్రవరి 3వ తేదీన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (CAPFIMS) రహదారిని ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా సందర్శించారు. రైట్ ఆప్ వేలో చెట్లను తొలగించాలని ఎల్జీ ఆదేశించారు. అందుకు సంబంధించిన అంశాలు చెట్లు నరికిన సంస్థలు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేశాయి.
ప్రధాని మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు జారీ అయిన సమన్లను కొట్టేయాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది