Anil Jha: కీలక రాజకీయ పరిణామం.. ఆప్‌లో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝా
ABN , Publish Date - Nov 17 , 2024 | 03:54 PM
కిరారీ అసెంబ్లీ నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్తల్లోనూ గట్టిపట్టు ఉన్న అనిల్ ఝా కొద్దికాలంలో పార్టీ నాయకత్వం, విధానాలపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ మారడం ద్వారా బీజేపీకి సంప్రదాయబద్ధంగా గట్టి పట్టున్న కిరారీలో ఆప్‌కు లబ్ధి చూకూరే అవకాశాలున్నాయని అంటున్నారు.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝా (Anil Jha) ఆదివారంనాడు అధికారికంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో చేరారు. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ ఢిల్లీలోని కిరారి(Kirari) అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు సార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ ఝా ఆ పార్టీని వీడి ఆప్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Kailash Gahlot: 'ఆప్'కు గట్టిదెబ్బ.. మంత్రి రాజీనామా
కిరారీ అసెంబ్లీ నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్తల్లోనూ గట్టిపట్టు ఉన్న అనిల్ ఝా కొద్దికాలంలో పార్టీ నాయకత్వం, విధానాలపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ మారడం ద్వారా బీజేపీకి సంప్రదాయబద్ధంగా గట్టి పట్టున్న కిరారీలో ఆప్‌కు లబ్ధి చూకూరే అవకాశాలున్నాయని అంటున్నారు.
అనిల్ ఝాని పార్టీలోకి అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానిస్తూ, పూర్వాంచల్ కమ్యూనిటీ గట్టి పలుకుబడి కలిగిన నేత అనిల్ ఝా అని, ఢిల్లీలోని అనధికార కాలన్నీలో గణనీయంగా పూర్వాంచల్ కమ్యూనిటీ వాసులు ఉంటున్నారని, ఏళ్లతరబడి వారిని బీజేపీ, కాంగ్రెస్ నిర్లక్ష్యం చేశాయని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆ కాలనీలలో అభివృద్ధి పనులు, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తానని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Air Pollution: రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..
Viral Video: మోదీ నినాదాలు, డప్పుల చప్పుళ్లు.. నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం
Read More National News and Latest Telugu News