Share News

Raghuvinder Shokeen: గెహ్లాట్ ఔట్..రఘువీందర్ ఇన్

ABN , Publish Date - Nov 18 , 2024 | 03:18 PM

ఢిల్లీ ఆరవ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడైన షోకోన్ ప్రస్తుతం నాంగ్లోయి జాట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983-88 మధ్య ఆయన కురుక్షేత్ర ఎన్ఐటీలో ఇంజనీరింగ్ గ్యాడ్యుయేట్ చేశారు.

Raghuvinder Shokeen: గెహ్లాట్ ఔట్..రఘువీందర్ ఇన్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మొదట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో వేగంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న కైలాష్ గెహ్లాట్ అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అంతే వేగంగా ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గెహ్లాట్ స్థానంలో జాట్ నేత, శాసనసభ్యుడు రఘువీందర్ షోకీన్ (Raghuvinder Shokeen)ను మంత్రివర్గంలోకి తీసుకుంది. సర్కార్ నిర్ణయంపై షోకీన్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Kailash Gehlot: బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్


''ఆప్ ప్రభుత్వం అన్ని కులాలకు బాసటగా నిలుస్తోంది. బీజేపీ ఎప్పుడూ జాట్‌లను విడగొడుతూనే వచ్చింది. హర్యానాలో జాట్‌లు, నాన్‌జాట్‌లు అంటూ విడగొట్టింది. ఆప్ అధినాయకత్వం మాత్రం పార్టీతో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించింది'' అని రఘువీందర్ షోకీన్ అన్నారు. ఢిల్లీ ఆరవ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడైన షోకోన్ ప్రస్తుతం నాంగ్లోయి జాట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983-88 మధ్య ఆయన కురుక్షేత్ర ఎన్ఐటీలో ఇంజనీరింగ్ గ్యాడ్యుయేట్ చేశారు. కాలేజీ రోజుల నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉంటూ వచ్చారు.


వేగంగా పరిణామాలు..

ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కైలాష్ గెహ్లాట్ ఆదివారంనాడు ఆ పార్టీకి, మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఇదే వేగంతో సోమవారంనాడు బీజేపీలో చేరారు. ఇచ్చిన హామీలను ఆప్ సర్కార్ నిలబెట్టుకోలేకపోవడం, కేంద్రంతో నిరంతర ఘర్షణాత్మక వైఖరి, యమునా నదీ ప్రక్షాళనపై ఇచ్చిన హామీకి తూట్లు పొడవడం వంటి పలు కారణాలు తన రాజీనామా నిర్ణయానికి దారితీసినట్టు చెప్పారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. మోదీ విజన్, సిద్ధాంతాలకు అనుగుణంగా ఢిల్లీ ప్రజలకు నిరంతర సేవ చేస్తానని తెలిపారు.


ఇవి కూడా చదవండి...

Swara Bhasker: స్వరభాస్కర్.. ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన బాలీవుడ్ నటిపై నెటిజన్ల ఆగ్రహం..

New Delhi: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. పెన్షన్ రూల్‌లో మార్పు..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 18 , 2024 | 03:18 PM