Home » Maldives
తమ దేశంలో పర్యటనకు రావాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు, భారత్‌తో విభేదాలతో తమ పర్యాటక ఆదాయం పడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.
నరేంద్ర మోదీ, ముయుజ్జులు హైద్రాబాద్ హౌస్ నుంచి పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇరుదేశాలు కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకోవడంతో పాటు పలు ఎంఓయూలపై సంతకాలు చేశారు.
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ద్వైపాక్షిక చర్చల కోసం తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టారు.
భారత్ అంటేనే కత్తులు నూరిన మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohammed Muizzu) ఇవాళ కొత్త పల్లవి అందుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్.. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూతో శనివారం సమావేశమైన విషయం విదితమే.
కేంద్ర బడ్జెట్ 2024-25లో మాల్దీవులకు మోదీ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’ విధానం కింద అభివృద్ధి సాయం నిధుల్లో భూటాన్‌కు రూ.2,068 కోట్ల అత్యధిక వాటా కేటాయించింది. గతేడాది బడ్జెట్లో మాల్దీవులకు రూ.770.9 కోట్లు కేటాయించగా ఇప్పుడు దాన్ని రూ.400 కోట్లకు పరిమితం చేసింది. ఈ కేటాయింపు
భారత్ విషయంలో మాల్దీవుల తీరు మారడం లేదు. గత ప్రభుత్వం భారత్‌తో చేసుకున్న కొన్ని ఒప్పందాలపై మాల్దీవుల పార్లమెంట్ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు భారత్
ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని మాల్దీవులు ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ మాల్దీవుల పర్యటనకు వెళ్లొద్దని దానికి బదులుగా భారత్‌లోని లక్షద్వీ్‌పను సందర్శించాలని తమ దేశ ప్రజలను కోరింది. ఈ నిర్ణయాన్ని భారత్‌లో ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కోబీ షోషాని స్వాగతించారు.
మహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి.. ఆ దేశంతో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. భారత దళాలను తిరిగి వెనక్కు పంపడం, టూరిజం వివాదం, ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు.. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
మాల్దీవులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి పరిమిత స్థాయిలో బియ్యం, గోధుమలు సహా పలు నిత్యావసర వస్తువుల ఎగుమతికి భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వస్తువుల ఎగుమతిపై ఏప్రిల్ 1 నుంచి 2024-25 సంవత్సరానికి నిషేధం ఉంది. అయితే ఇప్పుడు మాల్దీవులు చేసిన విజ్ఞప్తిపై ఆ దేశానికి నిత్యావసర వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది.
మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ముయిజ్జు భారత వ్యతిరేకత వైఖరి వల్లే ఇరు దేశాల మధ్య ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. తన మొండి వైఖరిని మార్చుకోవాల్సిందిగా మాల్దీవుల ప్రతిపక్షాలు కోరుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ అదే డిమాండ్ చేశారు.