Home » Manifesto
ఎన్నికల్లో ఎందుకు తమ పార్టీకి ఓటు వేయాలనేది ప్రజలకు ఆయా పార్టీలు వివరించాల్సి ఉంటుందని, తమ కూటమి ప్రధానంగా 7 గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తోందని, ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని ఖర్గే, హేమంత్ సోరెన్ తెలిపారు.
కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.18,000 ఇచ్చేందుకు 'మా సమ్మాన్ యోజన' అనే పథకం తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉజ్వల స్కీమ్ కింద ఏటా రెండు సిలెండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపింది. కాలేజీ విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్‌గా ఏటా రూ.3,000 ఇస్తామని హామీ ఇచ్చింది.
Supreme Court of India: ఎన్నికల(Elections) సమయంలో రాజకీయ పార్టీలు(Political Parties) ఇచ్చే హామీలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన కామెంట్స్ చేసింది. పార్టీలు ఇచ్చే హామీలు అవినీతిగా పరిగణించలేమని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం(Supreme Court). ఎన్నికల్లో పార్టీలు చేసే వాగ్ధానాలు అవినీతి కిందకు రాదని తెలిపింది.
కాంగ్రెస్ చెబుతున్న మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తే భారత్ దివాళా తీయడం ఖాయమని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Polls 2024)ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ముంబయిలో పర్యటించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలపై మాజీ మంత్రి మండిపడ్డారు. గతంలో ఇచ్చిన సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ.. పావలా వడ్డీని కూడా పట్టించుకోలేదన్నారు.
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకునే సరికి.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక పార్టీ మారిన నేతలు అయితే.. బాబోయ్ మునుపటి పార్టీ బాగోతం బట్టబయలు చేస్తున్నారు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా మీడియా మీట్, బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ దుమ్ముదులిపేస్తున్నారు. తాజాగా.. ప్రముఖ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీ (YSR Congress) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నది ఒకే ఒక్క మాటే అయినా.. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆయన ఏమన్నారో చూసేద్దాం రండి..!
Andhrapradesh: గాజువాక పీపుల్స్ మేనిఫెస్టో 2024 మంత్రి గుడివాడ అమర్నాథ్ విడుదల చేశారు. గురువారం గాజువాక పార్టీ ఆఫీసులో నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. గాజువాక నియోజకవర్గం ప్రజల అభిప్రాయాలు సేకరించి మ్యానిఫెస్టో తయారు చేశామని తెలిపారు. ఉగాది రోజున ఒక వెబ్ సైట్‌ను ప్రారంభించి...
Andhrapradesh: టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టోపై కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజల గళం నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని చెప్పుకొచ్చారు. గురువారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేడమే కూటమి మేనిఫెస్టో లక్ష్యమని స్పష్టం చేశారు.
Andhrapradesh: రెండవ దశ పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రధాని మోదీలో కాన్ఫిడెన్స్ తగ్గిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ 200 స్థానాలు కూడా గెలవలేదన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తులో ఉందో తెలియడం లేదన్నారు.