Home » Maoist Encounter
ఒడిశాలోని వివిధ జిల్లాల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సవ్యసాచి పాండ తీవ్ర అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.
మావోయిస్టుల కంచుకోట అబుజ్మడ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు-నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా.. ఇద్దరు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్‌లో అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి కడప జవాన్ సహా ఐటీబీపీ(ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు) దళానికి చెందిన ఇద్దరు మరణించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలకు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నట్లు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్ జిల్లా దుర్బేరా సమీపంలోని కొడ్లియార్ అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా బుధవారం ఐఈడీని మావోయిస్టులు పేల్చారు. ఈ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులను రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.
అక్టోబర్ 4వ తేదీన.. దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మరణించారు. అయితే పోలీసులు మాత్రం 31 మంది వివరాలను మాత్రమే వెల్లడించారు. మిగిలిన వారిలో అగ్రనేతలు ఉన్నారంటూ ఓ ప్రచారం సైతం సాగింది. కానీ ఈ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ ఎన్కౌంటర్లో అగ్రనేతలు ఎవరు మరణించ లేదని స్పష్టం చేసింది.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం మిస్టరీగా మారింది. సుజాతక్కను రెండు రోజుల క్రితం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మావోయిస్ట్ పార్టీ మహిళా అగ్రనేత సుజాత అలియాస్ కల్పన పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం కొత్తగూడెంలోని హాస్పిటల్‌కు రాగా పోలీసులు పట్టుకున్నట్లు తెలియవచ్చింది. కాగా మహబూబాబాద్ బస్టాండ్‌లో ఆమెను అరెస్ట్ చేసినట్లు మరో ప్రచారం జరుగుతోంది.
అక్టోబర్ 4వ లేదీ ఉదయం 11.30 నుంచి రాత్రి 9 గంటల వరకు 11 సార్లు భద్రతా బలగాలు కాల్పులు జరిపారని.. ఎదురు కాల్పులు ల్లో 14 మంది మావోయిస్ట్‌లు అమరులు అయ్యారని, మరుసటి రోజు ఉదయం (అక్టోబర్ 5 న) కాల్పుల్లో గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. తూర్పు బస్తర్ డివిజన్ కమిటీని అంతం చేయడానికి ఫాసిస్ట్ పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడింది.