Home » Memantha Siddham
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా పోలింగ్ లేకపోవడంతో.. ఇక చివరిగా అస్త్రాలు సంధించడానికి అధికార, ప్రతిపక్షాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. అదేమిటంటే..
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్మోహన్రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం జగన్ నగరంలో వేపగుంట జంక్షన్ నుంచి పీఎం పాలెం వరకూ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన..
వైసీపీని (YSR Congress) ఓటమి భయం వెంటాడుతోందా..? ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నీ వైసీపీకి కష్టమేనని చెప్పడం, కనీసం ఐదారు ఎంపీ సీట్లు కూడా గెలవడం కష్టమేనని చెప్పడంతో ఒకరిద్దరు అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమేననిపిస్తోంది. ఇంతకీ వైఎస్ జగన్ (YS Jagan) మార్చాలనుకుంటున్న ఆ ఎంపీ అభ్యర్థి ఎవరు..? సొంత పార్టీ సోషల్ మీడియాలో ఎందుకింతలా ప్రచారం చేస్తున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో తెలుసుకుందాం రండి..
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర పేరిట నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న (శుక్రవారం) జగ్గంపేట నియోజకవర్గంలోకి బస్సు యాత్ర చేరుకోగానే అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఆదిత్య కాలేజీ వద్దకు రాగానే అక్కడి విద్యార్థులు సీఎంను ఉద్దేశించిన చేసిన నినాదాలు హాట్ టాపిక్‌గా మారాయి.
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒకరోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం కేసరపల్లి క్యాంపు సైట్ నుంచి సీఎం బస్సు యాత్ర మొదలైంది. ఈ సందర్భంగా కేసరపల్లికి భారీగా అభిమానులు చేరుకుని ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అయితే... మొన్న విజయవాడలో దాడి జరిగిన నేపథ్యంలో సీఎం బస్సుయాత్రకు మూడు అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కాసేపటికే జగన్ బస్సు యాత్ర గన్నవరంకు చేరుకుంది.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర మరికాసేపట్లో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. అయితే సీఎం బస్సు యాత్ర రాకముందే ప్రజలు మాత్రం కష్టాలు పడాల్సి వస్తోంది. సీఎం జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర కోసం ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. సీఎం తాడేపల్లిలో ఇంకా బయలుదేరకముందే బెజవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు చవిచూస్తున్నారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ‘‘మేమంతా సిద్ధం’’ పేరిట బస్సు యాత్ర చేస్తూ రాష్ట్రమంతటా ప్రజల్లోకి వెళ్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బస్సు యాత్రతో సీఎం ప్రచారం నిర్వహించారు. అయితే బస్సు యాత్ర సందర్భంగా తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం... అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది.
మేమంతా సిద్ధం’ పేరుతో బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్‌కు అన్నమయ్య జిల్లా ప్రజలు గట్టి దెబ్బే కొట్టారు.
YSRCP Situation In Kadapa: మేమంతా సిద్ధం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైకి చెబుతున్నారే కానీ.. సొంత ఇలాకా కడప జిల్లాలో మాత్రం అస్సలు బాగోలేదు. జగన్ కడప జిల్లాకు వెళ్లొచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది..
’నేను మీ బిడ్డను.. పేదల పక్షపాతిని..’ అంటూ డైలాగులు చెప్పే జగన్‌కు ఆ జనమంటేనే భయమా.? గత ఎన్నికల ముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు,