AP Elections: వైసీపీకి ఓటమి భయం.. ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో జగన్!
ABN , Publish Date - Apr 20 , 2024 | 03:52 PM
వైసీపీని (YSR Congress) ఓటమి భయం వెంటాడుతోందా..? ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నీ వైసీపీకి కష్టమేనని చెప్పడం, కనీసం ఐదారు ఎంపీ సీట్లు కూడా గెలవడం కష్టమేనని చెప్పడంతో ఒకరిద్దరు అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమేననిపిస్తోంది. ఇంతకీ వైఎస్ జగన్ (YS Jagan) మార్చాలనుకుంటున్న ఆ ఎంపీ అభ్యర్థి ఎవరు..? సొంత పార్టీ సోషల్ మీడియాలో ఎందుకింతలా ప్రచారం చేస్తున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో తెలుసుకుందాం రండి..
వైసీపీని (YSR Congress) ఓటమి భయం వెంటాడుతోందా..? ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నీ వైసీపీకి కష్టమేనని చెప్పడం, కనీసం ఐదారు ఎంపీ సీట్లు కూడా గెలవడం కష్టమేనని చెప్పడంతో ఒకరిద్దరు అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమేననిపిస్తోంది. ఇంతకీ వైఎస్ జగన్ (YS Jagan) మార్చాలనుకుంటున్న ఆ ఎంపీ అభ్యర్థి ఎవరు..? సొంత పార్టీ సోషల్ మీడియాలో ఎందుకింతలా ప్రచారం చేస్తున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో తెలుసుకుందాం రండి.
ఇదీ అసలు కథ!
వైసీపీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు, ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ట్వీట్లను నిశితంగా పరిశీలిస్తే అనకాపల్లి (Anakapalle) ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు తెలియవచ్చింది. ఎంపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాసరావును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇవాళ అనకాపల్లిలో జరగనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా జగన్ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. కాగా ఇప్పటికే అనకాపల్లి అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడిని వైసీపీ హైకమాండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎందుకు.. ఏం జరిగింది..?
అవంతిని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మారిస్తే జిల్లాలో సమీకరణాలు మారిపోతాయన్నది వైసీపీ ప్లానట. ఎందుకంటే.. అనకాపల్లి నుంచి కూటమి తరఫున ఎంపీగా పోటీచేస్తున్నది సీఎం రమేష్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల వచ్చిన సర్వేలు, ఐప్యాక్ ఇచ్చిన నివేదికల్లో కూటమి గెలిచే ఎంపీ సీట్లలో అనకాపల్లి కూడా ఉందట. దీంతో అలర్టయిన వైసీపీ.. అవంతిని బరిలోకి దింపుతోందట. గతంలో టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన అనుభవం.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో ఉన్న పరిచయాలు, కాపు కమ్యూనిటీ ఇవన్నీ కలిసొస్తాయని వైసీపీ భావిస్తోందట. ఇదే నిజమైతే.. భీమిలి నుంచి వైసీపీ నుంచి పోటీచేసేదెవరు..? ముత్యాల నాయుడి పరిస్థితేంటి..? అసలు మార్పుల వ్యవహారంపై వస్తున్న వార్తల్లో నిజానిజాలెంత అనేది శనివారం సాయంత్రం లోపు తేలిపోనుంది.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి