Share News

AP Elections: ఇవెక్కడి కష్టాలు బాబోయ్.. జగన్ బస్సు యాత్రపై బెజవాడ వాసుల ఫైర్

ABN , Publish Date - Apr 13 , 2024 | 04:36 PM

Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర మరికాసేపట్లో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. అయితే సీఎం బస్సు యాత్ర రాకముందే ప్రజలు మాత్రం కష్టాలు పడాల్సి వస్తోంది. సీఎం జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర కోసం ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. సీఎం తాడేపల్లిలో ఇంకా బయలుదేరకముందే బెజవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు చవిచూస్తున్నారు.

AP Elections: ఇవెక్కడి కష్టాలు బాబోయ్.. జగన్ బస్సు యాత్రపై బెజవాడ వాసుల ఫైర్

అమరావతి, ఏప్రిల్ 13: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) చేపట్టిన ‘‘మేమంతా సిద్ధం’’ (Memantha Siddham) బస్సు యాత్ర మరికాసేపట్లో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. అయితే సీఎం బస్సు యాత్ర రాకముందే ప్రజలు మాత్రం కష్టాలు పడాల్సి వస్తోంది. సీఎం జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర కోసం ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. సీఎం తాడేపల్లిలో ఇంకా బయలుదేరకముందే బెజవాడ వాసులు మాత్రం ట్రాఫిక్ కష్టాలు చవిచూస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ రెండు గంటలకు పైగా పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి.

Bournvita: బోర్న్‌విటా ‘హెల్త్ డ్రింక్ కాదు’.. కేంద్రం సంచలన ఆదేశాలు


విజయవాడ నగరం నుంచి సీతానగరం వైపు ప్రకాశం బ్యారేజి మీదగా కార్లను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో తాడేపల్లి, మంగళగిరి, ఉండవల్లి, అమరావతి వైపు వెళ్లవలసిన వాహనాలన్నీ వారధివైపుకు మళ్లించారు. ఈ క్రమంలో కనకదుర్గ వారధిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో జనాలు ఎక్కువ కనిపించే ప్రణాళిక ఇది అంటూ నగరవాసులు మండిపడుతున్నారు. సీఎం వస్తే చెట్లు కొట్టేయడమే కాకుండా.. ట్రాఫిక్‌ను అదే రూట్‌లోకి మళ్లించి జనానికి నరకయాతన చూపించడంపై బెజవాడ వాసులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి...

YS Bharathi: జగన్ కోసం భారతీ..!

Venkatram Reddy: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఉన్నట్టు కథలు అల్లారు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 13 , 2024 | 04:54 PM