Home » Nagaland
నాగాలాండ్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటిస్తున్నారు. నాగాలాండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అధికారులతో కలిసి బండి సంజయ్ సమీక్షించారు.
భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నాగా మానవ అవశేషాల వేలం వేయలనే నిర్ణయాన్ని బ్రిటన్ విరమించుకుంది. బ్రిటన్‌లో నాగా మానవ అవశేషాలను బుధవారం అన్ లైన్ వేలం వేయాలని బ్రిటన్ నిర్ణయించింది. ఈ వేలం వేయడంపై భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. ఇక్కడ 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ ఖాతా తెరిచింది. ఆ పార్టీకి నాగాలాండ్ అసెంబ్లీలో సైతం గత ఇరవయ్యేళ్లుగా ప్రాతినిధ్యం లేదు.
కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' నాగాలాండ్ రాజధాని కోహిమాకు సోమవారం సాయంత్రం చేరుకుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరోసారి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై తమ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. జనవరి 22 జరిగే కార్యక్రమం 'ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం' అని అన్నారు.
భారతీయ జనతా పార్టీ (BJP) నాగాలాండ్, మేఘాలయ, పుదిచ్చేరికి కొత్త అధ్యక్షులను నియమించింది. నాగాలాండ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బెంజమిన్ యేప్‌థోమి, మోఘాలయ రాష్ట్ర అధ్యక్షుడిగా రిక్మన్ మొమిన్‌లను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
చదువుకునే రోజుల్లో కటిక దరిద్రం అనుభవించిన వాళ్లు.. ఎలాగైనా సమస్యల నుంచి గట్టెక్కాలనే ఉద్దేశంతో బాగా చదువుకుని చివరకు అనుకున్నది సాధిస్తుంటారు. తినడానికి తిండి లేని స్థానం నుంచి ఎందరో పేదలకు కడుపు నింపే స్థాయికి చేరుకుంటుంటారు. కొందరు...
నాగాలాండ్ లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారంనాడు తప్పుపట్టింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది.
ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా నాగాలాండ్ మంత్రి (Nagaland Minister) తెమ్జేన్ ఇమ్నా(Temjen Imna Along) చేసిన ఓ తమాషా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్డీపీపీ నేత నెఫియు రియా మంగళవారంనాడు ప్రమాణస్వీకారం..
తాజాగా మేఘాలయ సంకీర్ణ సర్కారులో బీజేపీ కూడా చేరింది.