Home » Nagarjuna Sagar
పోతిరెడ్డిపాడు ద్వారా జరుపుతున్న నీటి తరలింపును తక్షణం నిలిపివేయాలని, శ్రీశైలం కుడి, ఎడమ వైపుల నిర్వహిస్తున్న జలవిద్యుత్ ఉత్పత్తిని ఆపివేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది.
నిత్యం ఉరుకుల పరుగులు బిజీగా బిజీగా సాగే జీవన గమనంలో ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సాగేందుకు తెలంగాణ టూరిజం లాంచ్‌ను ఏర్పాటు చేసింది. మరీ సాగర్ టూ శ్రీశైలం వెళ్లేటటువంటి క్రూయిజ్ లాంచ్‌లో ఏలాంటి మధురానుభూతులు, ప్రకృతి అందాలు ఉంటాయో ఏబీఎన్‌లో చూడండి.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద శనివారం మరోసారి ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సాగర్ ప్రాజెక్టు(తెలంగాణ) జేఈ కృష్ణయ్య కథనం ప్రకారం.. కుడికాల్వ వద్ద నీటి నిల్వల రీడింగ్ తీసుకునేందుకు వర్క్స్ ఇన్స్పెక్టర్ వీరయ్య ఉదయం 8 గంటల సమయంలో ప్రయత్నించగా..
నల్లమల అందాల మధ్య కృష్ణమ్మ ఒడిలో లాహిరి లాహిరి లాహిరిలో అంటూ నాగార్జున సాగర్ నుంచి ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి శనివారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లాంచీ ప్రయాణం ప్రారంభమైంది.
నాగార్జున సాగర్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి రెండ్రోజులుగా నీరు విడుదలవుతోంది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 67,403 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గతంలో అంటే.. 2018లో 68 పులులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం.. వాటి సంఖ్య 90 నుంచి 95కు పెరిగింది. 2025 నాటికి ఈ పులుల సంఖ్య 100 దాటుతుందని అధికారులు అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా, తుంగభద్ర నదులకు స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఖమ్మం సాగర్ కెనాల్లో పడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాపణకుంటకు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరంతా గంజాయి కేసులో బెయిల్ కోసం వెళ్లగా ప్రమాదవశాత్తూ కాలువలో పడి గల్లంతయ్యారు.
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా సాగు, జలవిద్యుత్ అవసరాలకు అడ్డదిడ్డంగా నీటిని ఇరు రాష్ట్రాలు తరలించడంతో రిజర్వాయర్‌లో నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.