Home » Prakasam
పోలీసులు తనకిచ్చిన నోటీసులపై డైరక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని, విచారణకు సహకరిస్తానని, వారం రోజుల గడువు కావాలని కోరుతూ మద్దిపాడు పోలీసులకు ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కామాంధుడు చేసిన పనికి బాలిక ప్రాణాల కోసం పోరాటం చేస్తోంది.
జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, రిజర్వాయర్ పనులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం.. దగా అని దుయ్యబట్టారు.
Andhrapradesh: గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు పట్టించుకున్న దాఖలాలు లేవని... ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గపు పనులు గత ఐదేళ్లలో జగన్ చేశారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. అందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకి పరిమితం చేశారని అన్నారు.
Andhrapradesh: కాకినాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. బార్జీల నుంచి నౌకలకు బియ్యం రవాణా నిలిపివేశారు అధికారులు.
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.
జనసేన పార్టీలో గురువారం అంటే.. 26వ తేదీన చేరనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తనపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉందన్నారు. గతంలో రెండు మూడు మీటింగ్స్‌లో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వ్యక్తులు ఉన్నారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారని ఈ సందర్బంగా బాలినేని గుర్తు చేశారు.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తున్నాడంటే దారి వెంట చెట్లు మొత్తం కొట్టేసేవారని, పరదాల మాటున వచ్చేవారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేదని చెప్పారు. గతంలో ఎన్నడూ చూడనివిధంగా కూటమికి విజయం కట్టబెట్టారని అన్నారు. జగన్ సభలకు డ్వాక్రా మహిళలను లాక్కుని వచ్చేవారని ఆరోపణలు చేశారు.
ప్రకాశం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. మద్దిరాలపాడు గ్రామంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. 2.30 గంటలకు నాగులుప్పలపాడు మండలం, చదలవాడ చేరుకుంటారు.