CM Chandrababu: ప్రకాశం జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.
ABN , Publish Date - Sep 20 , 2024 | 07:14 AM
ప్రకాశం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. మద్దిరాలపాడు గ్రామంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు. 2.30 గంటలకు నాగులుప్పలపాడు మండలం, చదలవాడ చేరుకుంటారు.
ప్రకాశం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) శుక్రవారం ప్రకాశం జిల్లాలో (Prakasam Dist.,) పర్యటించనున్నారు. మద్దిరాలపాడు గ్రామంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ (Good Government) కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు. 2.30 గంటలకు నాగులుప్పలపాడు మండలం, చదలవాడ చేరుకుంటారు. మద్దిరాలపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తారు. అనంతరం గ్రామ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి ఉండవల్లి బయలుదేరి వెళతారు. కాగా సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సీఎం చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, రాజపురం గ్రామంలో పర్యటించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో భాగంగా తొలిసభ జిల్లాలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఆకస్మికంగా రద్దయినట్టు సమాచారం.
కాగా ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన హామీల అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు కోరారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా బుధవారం కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంగళగిరిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కొందరు చంద్రబాబును కలిశారు. ఒంగోలు ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముక్కు ఉగ్రనరసిం హారెడ్డి, అశోక్‌రెడ్డి, నారాయణరెడ్డి, ఏలూరి సాంబశివరావు తదితరులు ఆయా సమస్యలను ప్రస్తావించారు. ఎంపీ మాగుంట సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఓ ప్రత్యేక లేఖను సీఎంకు ఇచ్చారు. ఎమ్మెల్యే జనార్దన్ ఒంగోలు కార్పొరేషన్ అవసరాలపై ఓ లేఖను ఇచ్చా రు. తాగునీటి సమస్యలు, ఇతర అంశాల పరిష్కా రానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌రెడ్డిలు లేఖలు అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసి కనిగిరి నియోజకవ ర్గంలో ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణాలకు వెంటనే చర్య లు తీసుకోవాలని కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి కనిగిరి నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్యను వివరించి మంచినీటి పథకాల నిర్మాణాలకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు.