Home » Press release
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు వరంగల్ ముస్తాబైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహిస్తున్నారు.
విజయవాడ: మే 1వ తేదీన ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువై వడగాల్పులు వీస్తున్నాయని అందుచేత ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు.
అమరావతి: రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న గుంటూరు జిల్లా, తెనాలి వాసి గొల్తి గీతాంజలిని వైసీపీనే హత్య చేసిందని, ఆడబిడ్డ చావుపైనా జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.
శ్రీకాకుళం జిల్లా: ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత తీవ్రంగా నష్టపోయిందని, ప్రత్యేక హోదా తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారని, ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని జగన్ మాయ మాటలు చెప్పారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.
నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో కష్టపడిన వారికి అన్యాయం చేసిందని, దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
రాజమండ్రి: రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసి నేటికి పదేళ్ళు పూర్తయిందని, ఏపీ విభజన జరిగి పదేళ్లు గడిచినా విభజన హామీలు ఇప్పటి వరకు అమలుకావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ విమర్శించారు.
జగిత్యాల: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఉచ్చు బిగిస్తున్నామని తెలిపారు.
విశాఖ: ఏపీ రాష్ట్రంలో రాజకీయం జరుగుతోందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుందని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ జీవిని బంధించి హింసించడం చాలా దారుణమన్నారు.
బీజేపీ పాలనలో దేశ పరిస్థితులు బాగలేవని, పేదలు పేదలుగానే ఉంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. పార్లమెంట్ భవనాన్ని మార్చాల్సిన అవసరం లేకపోయినా మారుస్తున్నారని విమర్శించారు.
ఢిల్లీ: జగనన్న గృహ పథకాల్లో భారీ దోపిడీ జరిగిందని, ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు ఇవ్వలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.