Delhi: జగనన్న గృహ పథకాల్లో భారీ దోపిడీ: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2023-02-13T15:02:46+05:30 IST

ఢిల్లీ: జగనన్న గృహ పథకాల్లో భారీ దోపిడీ జరిగిందని, ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు ఇవ్వలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

Delhi: జగనన్న గృహ పథకాల్లో భారీ దోపిడీ: ఎంపీ రఘురామ

ఢిల్లీ: జగనన్న గృహ పథకాల్లో (Jagananna House Scheme) భారీ దోపిడీ (Robbery) జరిగిందని, ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు ఇవ్వలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇంటికి ఒక్క రూపాయి కూడా కట్టవద్దని ఎన్నికల ప్రచారంలో జగన్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సగం ఇళ్లు మంజూరు చేసినా నిర్మాణం చేపట్టలేదని ఆరోపించారు. ప్రధానమంత్రి స్కీమ్‌ (PM Scheme) కింద రూ. లక్షా 50 వేలు వస్తుందని, ఏపీ ప్రభుత్వం (AP Govt.) ఇచ్చేది రూ.30 వేలు మాత్రమేనని ఆయన అన్నారు. ప్రజలు రూ.5 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నారని, జగన్ ప్యాలెస్ వీడి కాలనీలను సందర్శించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో అడిగే హక్కు గవర్నర్‌కు ఉంటుందన్నారు. గత గవర్నర్ (Governor) ఆమోదించిన జీవోలను కోర్టు కొట్టివేసిందని రఘురామ పేర్కొన్నారు.

కొత్త గవర్నర్‌తో రాజ్యాంగ సంరక్షణ జరుగుతుందని, అబ్దుల్ నసీర్ (Abdul Naseer) మంచి న్యాయ కోవిదుడని ఆయనను ఏపీ గవర్నర్‌గా నియమించారని రఘురామ అన్నారు. అయితే గవర్నర్‌ను మారుస్తారని సీఎం జగన్ (CM Jagan) ఊహిచించలేదని అన్నారు. చర్చిలకు, నిర్మాణాలకు ప్రజల సొమ్మును కేటాయిస్తున్నారని, గత గవర్నర్ ఎన్నో జీవోలకు సంతకాలు పెట్టారని.. వాటిని కోర్టు కొట్టేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో అడిగే హక్కు గవర్నర్‌కు ఉంటుందన్నారు.

ఇప్పుడు వచ్చిన గవర్నర్ న్యాయ వ్యవస్థ గురించి తెలిసిన వ్యక్తి అని.. ఏపీకి రావడం శుభ పరిణామమని అన్నారు. ఇది అమరావతి రైతులకు (Amaravathi Farmers) కూడా మంచిదన్నారు.

శివరామకృష్ణన్ కమిటీ (Sivaramakrishnan Committee) క్లియర్‌గా చెబుతూ పది అంశాలు ముందు పెట్టిందని రఘురామ అన్నారు. రాజధానిని విజయవాడ (Vijayawada)లో ఎన్నుకున్నారని, జగన్ సాక్షిగా, అసెంబ్లీలో కూడా పెట్టిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. కేంద్రం అన్ని చూస్తోందని, ఒక న్యాయ నిపుణుడిని ఇక్కడికి పంపించరంటే అర్థం చేసుకోవచ్చన్నారు.

ఇంకా అందని జీతాలు...

రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగులకు ఇంకా జీతాలు ఇవ్వలేదని, టీచర్లను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని రఘురామ విమర్శించారు. ఉపాధ్యాయుల గురించి తప్పుగా మాట్లాడడం సరికాదని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-13T15:02:52+05:30 IST