Congress: వరంగల్‌లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభ
ABN , Publish Date - Nov 19 , 2024 | 09:19 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు వరంగల్ ముస్తాబైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభ 9Prajapalana Vijayotsava Sabha )కు వరంగల్ (Warangal) ముస్తాబైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఇందిరాగాంధీ జయంతి (Indira Gandhi Jayanti) రోజున ఈ సభ నిర్వహిస్తున్నారు. సభా వేదికకు 'ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం'గా పేరు పెట్టారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్యఅతిధిగా హాజరవుతున్నారు. లక్ష మందితో సభ నిర్వహిస్తామని మంత్రులు చెబుతున్నారు. కాగా ప్లెక్సీలు, కటౌట్లతో ఓరుగల్లు మూడు రంగులమయమైంది.
వరంగల్... సీఎం పర్యటన ఇలా..
వరంగల్ పర్యటనలోభాగంగా సీఎం రేవంత్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హయగ్రీవచారి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. 3 గంటలకు ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట రూ.92 కోట్ల వ్యయంతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. కవులు, కళాకారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 3.10 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మ.3.20కి ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50 గంటల వరకు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించి, ఎస్‌హెచ్‌జీ, ఎంఎస్, జడ్ఎస్ మహిళా గ్రూపు సభ్యులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు విజయోత్సవ సభ వేదికపైకి చేరుకుంటారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్మించనున్న 22 మహిళా శక్తి భవనాలకు వర్చువల్‌గా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో పది జిల్లాలో ఇప్పటికే ఈ భవనాలు ఉండగా, మిగిలిన జిల్లాల్లో కొత్తగా నిర్మించనున్నారు. ఎంజీఎంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌నూ ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేస్తారు., అనంతరం విజయోత్సవ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి: శ్రీధర్‌బాబు
కాగా వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. ఎన్నికల సమయంలో వరంగల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలను ఏడాదిలోనే నెరవేరుస్తున్నామని తెలిపారు. హనుమకొండలో మంగళవారం నిర్వహించనున్న విజయోత్సవ సభ ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, పదేళ్ల బీఆర్ఎస్ పాలన నిర్లక్ష్యం, స్వార్థపూరిత పాలనే ఇందుకు కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమస్యల పరిష్కారం సవాలుగా మారిందని, అయినా భయపడకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒంగోలు పోలీస్ స్టేషన్లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ..
అసెంబ్లీలో మంగళవారం ఏయే బిల్లులు ప్రవేశపెట్టనున్నారంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News