Home » PV Narasimha Rao
ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. ఫలితంగా దేశం ఎన్నో రంగాల్లో ముందడుగు వేసింది. పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఈ ఆర్థిక సంస్కరణలు ఎందరో పారిశ్రామిక వేత్తలను తయారు చేశాయి.
పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో 2021 నుంచి 2023 వరకు జరిగిన అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ డీజీ రీతూరాజ్కు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఫిర్యాదు చేశారు.
ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. శుక్రవారం పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇవాళ భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి. ఆయన జయంతిని తెలుగు రాష్ట్రాలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాయి. తెలంగాణ భవన్ లో మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహ రావు జయంతి సందర్భంగా పీవీ చిత్రపటం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు.
బహుముఖ ప్రజ్ఞశాలి, అపార మేధావి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. పీవీ నరసింహ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్మరించారు. పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారని గుర్తుచేశారు.
ఆలస్యం అయినా మట్టిలో మాణిక్యం పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వడం మంచి పని అని ఆయన మనవడు పీవీ సుభాష్ న్యూఢిల్లీలో పేర్కొన్నారు. భారత ప్రధానిగా దేశం కోసం, ప్రజల కోసం ఆయన చేసిన మంచి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి.. ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిపారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు.
బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేయనున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా ? లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది.