Home » Rajya Sabha
ఆరు దశాబ్దాలకు పైగా మహారాష్ట్రలో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మరాఠా యోధుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (84) పార్లమెంటరీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తిరిగి రాజ్యసభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారా..? గత కొద్ది రోజులుగా ఆయన ప్రసంగాలు విన్న వారంతా ఇదే చర్చించుకుంటున్నారు.
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ప్రాతినిధ్యం వహించడం మన రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
మోపిదేవి వెంటకరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా.. ఛైర్మన్ ఆమోదం తెలిపారు. మూడు సీట్లలో ఒకటి జనసేనకు మరో రెండు టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటినుంచే రాజ్యసభ సీట్ల కోసం..
బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో కృష్ణయ్య మాట్లాడారు.
ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఒక అత్యున్నతస్థాయి కమిటీని నియమించడంలో ప్రభుత్వ నిజ ఉద్దేశం ఆ కమిటీ పరిశీలనాంశాలు బహిర్గతం చేశాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఆరుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతుతో రాజ్యసభలో స్వల్ప ఆధిక్యం లభించింది. బీజేపీకి సొంతంగా 96 మంది ఎంపీలుండగా మొత్తం ఎన్డీయే ఎంపీల సంఖ్య 113.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచార ఘటనతోపాటు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి.
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ పదవులకు రాజీనామా చేశారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న మోపిదేవి వెంకటరమణ.. ఆ పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో విసిగివేసారిపోయిన ఆయన గుడ్ బై చెప్పేశారు.. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేర్లు ప్రస్తావించి మరీ.. ఇద్దరి మధ్య ఉన్న తేడాలను కూడా చెప్పుకొచ్చారు..
లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.