Share News

AP Politics: మోపిదేవి బాటలో మరో ఎంపీ..ఎవరతను

ABN , Publish Date - Aug 28 , 2024 | 01:43 PM

లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

AP Politics: మోపిదేవి బాటలో మరో ఎంపీ..ఎవరతను

అమరావతి, ఆగస్ట్ 28: లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా మోపిదేవి వెంకట రమణ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: Bangla bandh: బెంగాల్‌లో బంద్ హింసాత్మకం.. నలుగురు అరెస్ట్

Also Read: Jammu Kashmir Assembly Polls: తండ్రి తరఫున నామినేషన్ వేసిన సుగ్రా బర్కతి


సీఎం చంద్రబాబుతో ఇద్దరు వైసీపీ ఎంపీలు భేటీ

ఆయన బాటలోనే ఆ పార్టీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు సైతం తన పదవిని అర్థాంతరంగా వదులుకునేందుకు సిద్దమయ్యారని సమాచారం. పారిశ్రామికవేత్తగా ఉన్న ఆ ఎంపీ సైతం తన సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత ఆదివారం హైదరాబాద్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణతోపాటు సదరు పారిశ్రామికవేత్త భేటీ అయినట్లు సమాచారం.

Also Read: Dengue Fever: డెంగ్యూ .. ప్లాస్మా లీకేజీ.. జర జాగ్రత్త

Also Read: Nagpur: నగదు కోసం శిశువు విక్రయం: ఆరుగురు అరెస్ట్


చక్రం తిప్పిన చంద్రబాబు కేబినెట్‌లో కీలక మంత్రి

వైసీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీలో చేరడానికి చంద్రబాబు కేబినెట్‌లోని ఓ మంత్రి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. వైసిపి అగ్రనాయకత్వంతో సరిపడకనే తాను పార్టీ మారుతున్నట్టు మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. అలాగే పార్టీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read: Modi Cabinet: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక పరిణామం

Also Read: Himachal Pradesh: కంగన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం


రేపు వైయస్ జగన్‌కు గుడ్ బై..

గురువారం మధ్యాహ్నం రాజ్యసభ పదవికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నారు. అందుకు సంబంధించిన లేఖను ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్‌కు ఆయన స్వయంగా అందజేయనున్నారు. అనంతరం వైసీపీకి ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సదరు పారిశ్రామికవేత్త అయిన రాజ్యసభ సభ్యుడు సైతం మోపిదేవితోపాటు రాజీనామా లేఖను సభ చైర్మన్‌కు అందజేయనున్నారని తెలుస్తుంది. పార్టీలోని కీలక నేతలు అనుకున్నవారంతా ఇలా ఒకొక్కరుగా పార్టీ వీడడం పార్టీతోపాటు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌కు సైతం బిగ్ షాక్ అనే ఓ చర్చ సైతం ఆ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా సాగుతున్నట్లు తెలుస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2024 | 02:14 PM