Home » Telangana Bhavan
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి.. పేదలకు కనీస వసతులు కల్పించడమా... లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేయడమా.. అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబీ హటావో అంటారు కానీ గరీబోంకో హటావో అంటున్నారని మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని, రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
Telangana: హైడ్రాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు బాధితులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామని హైడ్రా బాధితులు చెబుతున్నారు.
తెలంగాణ పాల డెయిరీలను ఖతం చేసే కార్యక్రమం జరుగుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పాలు పోసిన తెలంగాణ పాడి రైతులకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు.
తెలంగాణలో రూ.32 వేలకోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు.
భారత న్యాయవ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని.. ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్తచట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్ ఆరోపించారు.
తెలంగాణ భవన్‌ను ఢిల్లీలోనే ఒక ఐకానిక్ టవర్గా నిర్మించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తాను మంత్రి పదవిని చేపట్టిన మూడో రోజే తెలంగాణ భవన్ నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ భవన్(Telangana Bhavan) శబరి బ్లాక్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ(Deepadas Munshi)తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) భేటీ ముగిసింది. సమావేశ అనంతరం బయటకు వచ్చిన దీపదాస్ మున్షీని మీడియా ప్రశ్నించగా.. పార్టీలో ఎవరు అసంతృప్తిగా లేరని, ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పనంటూ బదులిచ్చారు.
తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చారు...
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను జూన్ 1 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.