Share News

TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు

ABN , Publish Date - Sep 28 , 2024 | 10:42 AM

Telangana: హైడ్రాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు బాధితులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామని హైడ్రా బాధితులు చెబుతున్నారు.

TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు
Hydra affected families to Telangana Bhavan

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ‘‘హైడ్రా’’.. ఇప్పుడు ఇదే తెలంగాణలో పెద్ద హాట్‌టాపిక్. ఎప్టీఎల్, బఫర్‌ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ ఇళ్ల నిర్మాణాలు కూల్చివేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది హైడ్రా. ఏ రోజు, ఏ క్షణం హైడ్రా సిబ్బంది వచ్చి తమ ఇళ్లను కూల్చివేస్తారేమో అని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితుల్లో బాధితులు ఉన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు కొనసాగిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఎంతో కష్టపడి, కాయా కష్టం చేసుకుంటూ, బ్యాంకు లోన్లు తీసుకుని ఇళ్లు కట్టుకున్నామని.. ఒక్కసారికిగా హైడ్రా వచ్చి ఇవి అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటి అంటూ హైడ్రా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Janimaster: నా భర్తను ట్రాప్ చేసింది.. నరకం అంటే ఏంటో చూశా.. జానీ మాస్టర్ భార్య


తెలంగాణ భవన్‌కు...

తాజాగా హైడ్రాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు బాధితులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామని హైడ్రా బాధితులు చెబుతున్నారు. ఎప్పుడు కూలుస్తారో అని నిద్రకూడా పోకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వారు వాపోతున్నారు. బీఆర్ఎస్ పెద్దలను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామని హైడ్రా బాధిత కుటుంబాలు చెబుతున్నారు.

Amrapali: నగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు..


హైడ్రా భయంతో..

మరోవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. హైడ్రా తమ ఇళ్లను కూల్చివేస్తారనే భయంతో కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తమ ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుందని మనస్థాపంతో ఉరివేసుకొని మహిళ బలవన్మరణానికి పాల్పడింది. నల్ల చెరువు ఎఫ్టీఎల్‌లో ఇంటిని నిర్మించి బుచ్చమ్మ తన కూతుర్లకు ఇచ్చింది. గతవారం నల్లచెరువులో నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. అలాగే 20 ఇళ్లకు ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ వారం తమ ఇంటిని కూడా కూల్చివేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. కాగా ఈ ఘటనపై హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పందించారు. ఈ ఎపిసోడ్‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదంటూ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి కూల్చివేతను హైడ్రాతో ఆపాదిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 28 , 2024 | 10:56 AM