Home » Telangana Congress
రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.
బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దమ్ముంటే కాస్కో అని ఒకరు అంటే.. తేల్చుకుందాం రా అని ఇంకొకరు అంటున్న పరిస్థితి. ఈ మాటల తూటాలతో ఇద్దరి వ్యక్తుల మధ్య నెలకొన్ని ఈ రచ్చ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవగా మారిపోయింది...
బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు రాయలేనంతగా తిట్టిపోసుకున్న పరిస్థితి. కౌశిక్ ఓ బ్రోకర్ అని.. దమ్ముంటే బయటికి రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు గాంధీ...
భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం కాగా.. మరికొన్ని జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి.. తమ వంతుగా సాయం చేయడానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలు రంగాల పెద్దలు ముందుకొచ్చారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. ఇక ‘మేము సైతం’ అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ముందుకొచ్చి కొండంత సాయం చేసింది...
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కాక సీనియర్ నేత మహేశ్ కుమార్ గౌడ్ తొలిసారిగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు..? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీకాలం అయిపోయినంత వరకూ నడిచిన.. ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ. ఒకరా ఇద్దరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయ్..! అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది.. ఇదిగో ఈయనే కన్ఫామ్ అయ్యారని లెక్కలేనన్ని వార్తలు.. అంతకుమించి పుకార్లు షికార్లు చేశాయ్..! ఆశావహులు అయితే ఈసారైనా అదృష్టం వరించకపోదా..? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి..
బీఆర్ఎస్కు గుడ్ బై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఒక్కొక్కరికి ప్రాధాన్యత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పార్టీ కండువా కప్పుకున్న నేతలకు పదవులు ఇవ్వగా.. తాజాగా ఒక యంగ్ లీడర్‌కు, మరో సీనియర్ నేతకు కీలక పదవులు ఇస్తూ రేవంత్ సర్కార్ జీవోలు ఇవ్వడం జరిగింది...
తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. మొన్నటి వరకూ రుణమాఫీ, ఇప్పుడేమో మహిళల అఘాయిత్యాలపై ఇలా రోజుకో టాపిక్‌పై నేతలు మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. తాజాగా.. మంత్రి సీతక్కకు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...
మరికాసేపట్లో నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటాన్‌లో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష(CLP) సమావేశం జరగనుంది. సమావేశంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి(Abhishek Singhvi) పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.