Share News

CLP Meeting: మరికాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం..

ABN , Publish Date - Aug 18 , 2024 | 05:34 PM

మరికాసేపట్లో నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటాన్‌లో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష(CLP) సమావేశం జరగనుంది. సమావేశంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి(Abhishek Singhvi) పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.

CLP Meeting: మరికాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం..

హైదరాబాద్: మరికాసేపట్లో నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటాన్‌లో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష(CLP) సమావేశం జరగనుంది. సమావేశంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి(Abhishek Singhvi) పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలందరికీ ఇప్పటికే ఆహ్వానం పంపారు. దీంతో ఒక్కొక్కరిగా నగరానికి చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అభిషేక్ సింఘ్వి చేరుకున్నారు.


ముందుగా ఆయన జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సాయంత్రం జరిగే శాసనసభాపక్ష సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆయన మర్యాదపూర్వకంగా కోరనున్నారు. అనంతరం రేపు ఉదయం 11గంటలకు అసెంబ్లీలో సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున హాజరవుతారు.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: వారి ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్..

KTR: రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన కేటీఆర్..

MP Suresh Shetkar: అలా అన్నందుకు కేటీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే..

Updated Date - Aug 18 , 2024 | 05:37 PM