Home » Vemulawada
‘‘రాష్ట్రంలో భూసేకరణ చేయడం నేరమా? పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేయొద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వొద్దా? పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా మీరు ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేపట్టారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కేటీఆర్ కుట్రలను గమనిస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు.
రాజన్న క్షేత్రంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు కదలిక మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజన్న సిరిస్లిల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.
మరో వందేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
తామిచ్చిన డబ్బును ఓ వ్యక్తి తిరిగివ్వడం లేదనే కోపంతో అతడి తల్లిని ఓ కాంట్రాక్టర్ అపహరించాడు. అతని ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని బలవంతంగా తన కారులో ఎక్కించాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలు నేటితో ముగిశాయి. అందులోభాగంగా మంగళవారం సద్దుల బతుకమ్మను నిమ్మజ్జనం చేశారు. అందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే అంతకుముందు మున్సిపల్ కార్యాలయం నుంచి గౌరీ మాత అమ్మవారిని బతుకమ్మ ఘాట్ వరకు మున్సిపల్ పాలకవర్గం ఊరేగింపుగా తీసుకు వెళ్లింది.
ఎన్నో ఏళ్లుగా సిరిసిల్ల నేతన్నలు ఎదురు చూస్తున్న యారన్ డిపోకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని అధికారులు, అర్చకుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తిరుమల తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో సైతం నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.