Home » Viveka Murder Case
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆయన కొడుకు చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని మంగళవారం సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు...ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు.
ఎంపీ టికెట్ విషయంలో వివేకానందరెడ్డికి, అవినాష్ రెడ్డికి మధ్య విబేధాలు రాగా.. భారతి ఎంపీ టికెట్‌ను అవినాష్ రెడ్డికి ఇవ్వాలని ఒత్తిడి చేయగా.. వివేకానందరెడ్డి ఉండగా ఎంపీ టికెట్ ఇవ్వడం..
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అరెస్ట్ అయిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో A6 నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి తాను కారణం కాదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. వారిలో 22మంది ఇప్పటికీ ఉన్నారని... తనవల్లే పార్టీ మారినట్లు వారితో చెప్పించాలని ఆయన సవాల్ విసిరారు.
సుప్రీంకోర్టులో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు (YS Sharmila) ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడవద్దన్న కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. షర్మిల వేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Telangana: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వివేక హత్య కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు విచారణకు హాజరుపర్చారు.
పులివెందులలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు నిందితులో గురువారం సీబీఐ కోర్టును(CBI Court) ఆశ్రయించారు.
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య (Vivekananda Reddy Case), పెండింగ్ కేసులపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు (AP High Court)లో తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి అప్పీల్ వేశారు. ఇదే అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టును వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆశ్రయించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వివేకానందారెడ్డి వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడటం తగదని, చనిపోయిన వ్యక్తి, సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) హెచ్చరించారు. వైసీపీ మూకలకు మళ్లీ చెబుతున్న వివేక పర్సనల్ లైఫ్‌ని టార్గెట్‌గా చేసి మాట్లాడడం మానుకోవాలని మందలించారు.