AP Elections: మాకు దేవుడే రక్ష.. సీఎం జగన్‌పై షర్మిల విసుర్లు
ABN , Publish Date - Apr 21 , 2024 | 05:22 PM
మాజీ మంత్రి వివేకానందారెడ్డి వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడటం తగదని, చనిపోయిన వ్యక్తి, సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) హెచ్చరించారు. వైసీపీ మూకలకు మళ్లీ చెబుతున్న వివేక పర్సనల్ లైఫ్‌ని టార్గెట్‌గా చేసి మాట్లాడడం మానుకోవాలని మందలించారు.
కర్నూలు: మాజీ మంత్రి వివేకానందారెడ్డి వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడటం తగదని, చనిపోయిన వ్యక్తి, సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) హెచ్చరించారు. వైసీపీ (YSRCP) మూకలకు మళ్లీ చెబుతున్న వివేక పర్సనల్ లైఫ్‌ని టార్గెట్‌గా చేసి మాట్లాడటం మానుకోవాలని మందలించారు. ఆదివారం నాడు కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చిందన్నారు. సీబీఐ చార్జ్ షీట్‌లో పేర్కొన్న విషయాలే తాను, వివేకా కూతరు సునీత మాట్లాడుతున్నామని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిప్టు చదవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బిడ్డనని అన్నారు. మా అత్త ఇంకెవరైనా ఈ కేసు గురించి ఎన్ని మాట్లాడినా న్యాయమే గెలుస్తోందని స్పష్టం చేశారు.
TDP: చంద్రబాబు నివాసానికి వచ్చిన గిడ్డి ఈశ్వరి, ఎంఎస్ రాజు, రఘురామ..
ప్రజాకోర్టులో న్యాయం జరుగుతుందని, తాను, సునీత కొంగు పట్టుకొని ప్రజలను న్యాయం చేయాలని అడుగుతున్నామన్నారు. తమ ప్రాణాలకు తెగించి భయపడుతూ న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. సునీతకు, తనకు దేవుడే రక్షణ అని చెప్పారు. తాము పబ్లిక్ సర్వెంట్స్‌మని.. తమను అసభ్యంగా ధూషించొద్దని వైసీపీ మూకలను హెచ్చరించారు. వివేకానంద రెడ్డి ప్రజాసేవలో బతికిన వ్యక్తి అని కొనియాడారు.
AP Elections: వైసీపీ ఆశలు ఆవిరి.. ఆ నియోజకవర్గంలో వ్యూహం మార్చిన బీజేపీ..
వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వివేకా పర్సనల్ లైఫ్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కర్నూలులో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడానికి వచ్చారని అన్నారు. జగన్ అడ్డుపడక పోయింటే వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడేదని.. తాను సునీత రోడ్ల మీదకు వచ్చేవారమే కాదని చెప్పారు. గూగుల్ టేకౌట్‌లో అవినాష్ రెడ్డి ఇంట్లోనే సాక్ష్యాలను ఎందుకు చూపుతోందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
Chandrababu: ప్రచారానికి ఇంకా 20 రోజులే... చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Election 2024: పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేత లేఖ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం...