Home » Work from home
ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఈ ఉదయం AQI స్థాయి 450కిపైగా నమోదైంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కాలుష్య స్థాయికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని నిర్ణయించింది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన నాటి నుంటి ఇంటి నుంచి పని చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే ఇంటి నుంచి పని చేసినా, ఆఫీస్ నుంచి చేసినా కదలకుండా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి కుర్చొని కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ వర్క్ చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
కొవిడ్ కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం(Work From Home) దశ ముగిసిందని టీసీఎస్ హ్యుమన్ రిసోర్స్ ముఖ్య అధికారి(THRO) మిలింద్ లక్కడ్ ఆదివారం వెల్లడించారు.
వర్క్ ఫ్రం హోం కల్చర్‌కు ముగింపు పలకాలని ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థలన్నీ ప్రయత్నిస్తున్న తరుణంలో గ్లోబాంట్ అనే ఐటీ కంపెనీ సంచలనం నిర్ణయం తీసుకుంది. 33 దేశాల్లోని 30 వేల మంది ఉద్యోగులకు ఒక్కసారిగా వర్క్ ఫ్రం హోం ఇచ్చేసింది.
అమెరికాకు చెందిన దిగ్గజ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ అమెజాన్ సంస్థ (Amazon) ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేసింది. వారంలో మూడు రోజుల పాటు ప్రతీ ఉద్యోగి ఆఫీస్‌కు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు అమెజాన్ సీఈవో ఆండీ జాసీ (Amazon CEO Andy Jassy) స్పష్టం చేశారు.
ఇంతకాలం వర్క్ ఫ్రం హోమ్ (Work from Home) విధానంలో పనిచేసిన ఐటీ దిగ్గజం టీసీఎస్(TCS) ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్!. వర్క్ ఫ్రం హోమ్ విధానానికి సంపూర్ణంగా ముగింపు పలుకుతున్నట్టు కంపెనీ తెలిపింది.