Globant: ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేసిన ఎమ్‌ఎన్‌సీ!
ABN , Publish Date - Apr 19 , 2024 | 06:32 PM
వర్క్ ఫ్రం హోం కల్చర్‌కు ముగింపు పలకాలని ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థలన్నీ ప్రయత్నిస్తున్న తరుణంలో గ్లోబాంట్ అనే ఐటీ కంపెనీ సంచలనం నిర్ణయం తీసుకుంది. 33 దేశాల్లోని 30 వేల మంది ఉద్యోగులకు ఒక్కసారిగా వర్క్ ఫ్రం హోం ఇచ్చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వర్క్ ఫ్రం హోం కల్చర్‌కు ముగింపు పలకాలని ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థలన్నీ ప్రయత్నిస్తున్నాయి. నయానోభయానో ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఈ క్రమంలో గ్లోబాంట్ అనే ఐటీ కంపెనీ సంచలనం నిర్ణయం తీసుకుంది. 33 దేశాల్లోని 30 వేల మంది ఉద్యోగులకు ఒక్కసారిగా వర్క్ ఫ్రం హోం ఇచ్చేసింది. ఈ మేరకు ఫ్లెక్సిబుల్ పని విధానాన్ని కంపెనీ సీఈఓ, వ్యవస్థాపకుడు మార్టిన్ మియోగా వెల్లడించారు. దీంతో, ఉద్యోగుల సీఈపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు (Globant Just Allowed Its 30000 Employees To Work From Home). బిజినెస్ వర్గాల్లో ఈ వార్త సంచలనంగా (Viral) మారింది.
Ekagrah Rohan: 5 నెలల బుడ్డోడు, రూ. 4.2 కోట్లు దక్కించుకున్నాడు.. ఎలాగంటే
‘‘మేము పని విషయంలో ఉద్యోగుల సౌకర్యానికే తొలి ప్రాధాన్యం ఇస్తాం. ఆఫీసంటే కేవలం పని ప్రదేశం కాదు. ఉద్యోగులందరినీ ఒకచోటకు చేర్చే ప్రత్యేక ఆకర్షణీయ స్థలం’’ అని కంపెనీ ఫిలాసఫీని వివరించారు. తొలుత తాను వర్క్ ఫ్రం హోంకు (Work From Home) ముగింపు పలకాలనే భావించానని ఆయన తెలిపారు. కానీ, చివరకు ఉద్యోగులకు అనుగుణంగా మధ్యేమార్గాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు.
కరోనా సంక్షోభం తరువాత మారిన ఉద్యోగుల ప్రాధాన్యాలు, అవసరాలకు అనుగూణంగా సంస్థ తన కార్యాలయాలకు మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులకు వ్యక్తిగత టేబుళ్లకు బదులు అందరికీ ఒకే రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసింది. మిగితా జాగాను అదనపు లాంజ్ స్పేస్‌కు, ప్రైవేటు మీటింగుల కోసం వర్క్ స్టేషన్లకు కేటాయిస్తోంది. ఇక బ్రెజిల్ లోని సంస్థ ప్రధాన్య కార్యాలయంలో ఉద్యోగాలు చేసేవారికి జిమ్, ఫుడ్ వంటి అదనపు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసింది. ఆన్ సైట్ వర్క్ కల్చర్ లో మార్పులకు కూడా శ్రీకారం చుట్టింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి