Share News

Health News: మీరు గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే జాగ్రత్త..

ABN , Publish Date - Aug 06 , 2024 | 07:47 AM

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన నాటి నుంటి ఇంటి నుంచి పని చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే ఇంటి నుంచి పని చేసినా, ఆఫీస్ నుంచి చేసినా కదలకుండా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి కుర్చొని కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ వర్క్ చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

Health News: మీరు గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే జాగ్రత్త..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన నాటి నుంటి ఇంటి నుంచి పని చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే ఇంటి నుంచి పని చేసినా, ఆఫీస్ నుంచి చేసినా కదలకుండా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి కుర్చొని కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ వర్క్ చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఇది ధూమపానం కంటే కూడా ప్రమాదకరమని చెబుతున్నారు. డ్రైవింగ్ వంటి పనుల్లో కూడా ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.


వచ్చే ఆరోగ్య సమస్యలు..

రోజుల తరబడి ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల వెన్నుపూసపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోయి వెన్నునొప్పి వస్తుంది. మెడకండరాలు సైతం బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. రక్త ప్రసరణ సరిగా జరగక రక్తనాళాల్లో గడ్డలు గట్టే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరం. శరీరంలో కొవ్వు పెరిగిపోయి ఊబకాయం వస్తుంది. ఊబకాయం వల్ల అనేక రకాల గుండె సమస్యలు కూడా వస్తాయి. అయితే వీటిని నివారించేందుకు గంటకు ఒక 5నిమిషాల పాటు సీట్లో నుంచి లేచి మంచినీరు తాగడం, వాకింగ్ చేయడం వంటి ఇతర పనులు చేయాలి.


1. గుండెకు పొంచి ఉన్న ప్రమాదం..

అదే పనిగా కూర్చొని పని చేసే వారికి హృదయ సంబంధిత సమస్యలు పొంచి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. హైబీపీ, గుండెనొప్పి సహా పలు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రక్త ప్రసరణ సరిగా లేక జీవక్రియ తగ్గి గుండె సమస్యలు వస్తాయని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


2. ఊబకాయం సమస్య

గంటల తరబడి కూర్చోవడం వల్ల మన శరీరానికి క్యాలరీలు ఖర్చు చేసే అవకాశం ఉండదు. దీని వల్ల బరువు పెరిగి ఒబేసిటీ(ఊబకాయం) వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల అనేక రకాల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే తరచూ సీట్లో నుంచి లేచి నడవడం అలవాటు చేసుకోవాలి.


3. తీవ్రమైన ఎముకల నొప్పులు..

కదలకుండా పని చేసే వారిని తీవ్రమైన వెన్నునొప్పి, కీళ్లు, మెడ, కండరాల నొప్పులు వేధిస్తాయి. అందుకే వాకింగ్, జిమ్ చేయడం మంచిది. ఈ నొప్పులు వస్తే రోజువారీ కార్యకలాపాలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి ఇవి రాకముందే జాగ్రత్త పడడం మంచిది.


4. డయాబెటిస్ వచ్చే అవకాశం..

రోజుల తరబడి ఇలా కూర్చోని పని చేసే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం, బలహీనమైన గ్లూకోజ్ జీవక్రియ కారణంగా ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.


5. జీవితకాలం తగ్గుతుంది..

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల అది ఆయుష్షుపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదే అంశం పలు అధ్యయనాల్లో కూడా రుజువైనట్లు తెలిపారు. శరీరానికి సరిపడా శ్రమ కల్పించాలని, పని మధ్యలో తరచూ బ్రేక్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


6. మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం..

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక కుంగుబాటు(డిప్రెషన్), యాంగ్జయిటీ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. తీవ్రమైన నిరాశలో కూరుకుపోవచ్చు. అలాగే మానసిక ఆందోళనలు పెరిగిపోయి గుండె కొట్టుకునే తీరు మారొచ్చు. ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం మంచిది.

Updated Date - Aug 06 , 2024 | 07:47 AM