Viral Video: వామ్మో!.. నడి సముద్రంలో రెప్పపాటు కాలంలో.. యువతికి పెద్ద ప్రమాదమే తప్పింది..

ABN , First Publish Date - 2022-11-02T16:00:55+05:30 IST

సముద్రంలో సరదాగా షికారు చేస్తున్న సమయంలో అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి సమయాల్లో అదృష్టవశాత్తు.. కొందరు ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం అందరినీ షాక్‌కు గురి చేసే వీడియో (Shocking videos) ఒకటి నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఓ యువతి..

Viral Video: వామ్మో!.. నడి సముద్రంలో రెప్పపాటు కాలంలో.. యువతికి పెద్ద ప్రమాదమే తప్పింది..

సముద్రంలో సరదాగా షికారు చేస్తున్న సమయంలో అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి సమయాల్లో అదృష్టవశాత్తు.. కొందరు ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం అందరినీ షాక్‌కు గురి చేసే వీడియో (Shocking videos) ఒకటి నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఓ యువతి (young woman) సముద్రంలో స్కూబా డైవింగ్ (Scuba diving) చేస్తున్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తీరా నీళ్లలోకి దిగే సమయంలో ఓ పెద్ద సొర చేప.. దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే దాని బారి నుంచి యువతి చాకచక్యంగా తప్పించుకుంది.

Viral Video: ఈ కోతి రూటే సపరేటు గురూ.. బీరు బాటిల్‌లో చుక్క కూడా మిగల్చకుండా..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. ఓ యువతి స్కూబా డైవింగ్ చేసేందుకు సముద్రం మధ్యలోకి వెళ్తుంది. అన్నీ సిద్ధం చేసుకుని.. నీటిలోకి దిగేందుకు ప్రయత్నిస్తుంది. పడవ నుంచి కాలు నీటిలో పెట్టబోగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద సొరచేప అమాంతం నీటిలోంచి పైకి వచ్చి.. నోరు తెరచి, యువతి పైకి దాడి చేస్తుంది. అయితే వెంటనే అప్రమత్తమైన యువతి.. దారి బారి నుంచి చాకచక్యంగా తప్పించుకుంటుంది. కొంచెం అలస్యం అయ్యున్నా.. పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. కాసేపటి తర్వాత సొరచేప నీటిలోకి వెళ్లిపోతుంది. దీంతో మళ్లీ ఆ యువతి ఏమాత్రం భయం లేకుండా.. నీటిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం వద్దు.. అంటూ సూచనలు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

యువతి ఇయర్ బడ్స్‌పై కన్నేసిన చిలుక.. చివరకు ఎంత తెలివిగా దొంగతనం చేసిందో చూడండి..

Updated Date - 2022-11-02T16:01:02+05:30 IST