AP: కాకినాడ ఘటన మృతులకు పోస్ట్మార్టమ్ పూర్తి.. రిపోర్టులో విస్తుపోయే నిజాలు

ABN , First Publish Date - 2023-02-10T19:08:25+05:30 IST

ఆయిల్ పరిశ్రమ ఘటనలో (Kakinada incident) మృతులకు పోస్ట్మార్టమ్ (Post-mortem) పూర్తి అయింది.

AP: కాకినాడ ఘటన మృతులకు పోస్ట్మార్టమ్ పూర్తి.. రిపోర్టులో విస్తుపోయే నిజాలు

కాకినాడ: ఆయిల్ పరిశ్రమ ఘటనలో (Kakinada incident) మృతులకు పోస్ట్మార్టమ్ (Post-mortem) పూర్తి అయింది. నూనెమడ్డిలో కూరుకుపోయి ఏడుగురు కార్మికులు మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఏబీఎన్ చేతికి పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వివరాలు అందాయి. రిపోర్టులో విస్తుపోయే నిజాలను ఫోరెన్సిక్ వైద్యులు తేల్చి చెప్పారు. ట్యాంక్లోకి జారిపోయి పైకి లేవలేక మడ్డి నూనె మింగేయడంతో కార్మికుల ఊపిరితిత్తులు డ్యామేజీ అయ్యాయని పోస్ట్మార్టమ్ రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. ఊపిరి ఆడక నిమిషాల వ్యవధిలోనే కార్మికులు మృతిచెందినట్లు వెల్లడించారు. మృతదేహాల్లో.. విషవాయువులు పీల్చిన ఆనవాళ్లేవి లేవని గుర్తించామని ఫోరెన్సిక్ వైద్యులు చెప్పారు.

కాకినాడ ఆయిల్ పరిశ్రమ ఘటనపై కేసులు నమోదు అయ్యాయి. అంబటి ఆయిల్ పరిశ్రమ యాజమాన్యం సహా ఉద్యోగి వాసుపై పోలీసులు 304(ఏ) సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల తీరుపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెయిలబుల్ సెక్షన్తో కంపెనీకి కొమ్ము కాస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 304(ఏ) క్లాజ్ 2 కింద నాన్బెయిలబుల్‌ సెక్షన్ నమోదు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-10T19:10:35+05:30 IST