AP NEWS: సీఎం జగన్‌పై దళిత నాయకుల కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-01T19:04:23+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy)పై దళిత నాయకులు (Dalit leaders) కీలక వ్యాఖ్యలు చేశారు.

AP NEWS: సీఎం జగన్‌పై దళిత నాయకుల కీలక వ్యాఖ్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy)పై దళిత నాయకులు (Dalit leaders) కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ అల్లర్ల కేసులు ఎత్తివేయడంపై మండిపడ్డారు. జగన్ ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని, కేసులు ఎత్తివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలని దళిత సంఘాలు నేతలు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని దళిత సంఘాలు హెచ్చరించాయి. దళిత మంత్రి విశ్వరూప్, బీసీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లు తగులబెట్టిన వారు అమాయకులైతే అసలు దోషులు ఎవరు? అని దళిత నాయకులు ప్రశ్నించారు. దళిత సంఘాల అధ్యక్షతన ఈదురపల్లిలో అత్యవసర సమావేశం నిర్వహించారు.

అమలాపురంలో అల్లర్లు సృష్టించి దళిత మంత్రి పినిపే విశ్వరూప్‌, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ నివాసాలను దహనం చేసిన వ్యక్తులపై కేసులను ఎత్తివేయడం రాజ్యాంగ విరుద్ధమని దళిత ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఈదరపల్లి అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాలులో బొంతు రమణ అధ్యక్షతన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఓట్లు, సీట్లు కోసం చట్టపరంగా నమోదుచేసిన కేసులు ఎత్తివేస్తామనడం దారుణమన్నారు. సీఎం జగన్‌ దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నా రని ఆరోపించారు.

అమలాపురం ప్రధాన పాత్రధారులను గుర్తించేందుకు హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. కేసుల ఉపసంహరణ విరమించుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దళిత ప్రజా సంఘాల నాయకులు గిడ్ల వెంకటేశ్వరరావు, రేవు తిరుప తిరావు, ముత్తాబత్తుల రమణ, నక్కా సంపత్‌కుమార్‌, నూతనపాటి వివేక్‌, గెద్దాడ బుద్దరాజ్‌, కాట్రు కృష్ణ, పోతుల రవి, మెండి డేవిడ్‌అంబేడ్కర్‌, పరమట భీమామహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-01T19:05:19+05:30 IST